Begin typing your search above and press return to search.
రూ.3వేల కోట్ల బాదుడుకి కేసీఆర్ సర్కార్ ప్లానింగ్
By: Tupaki Desk | 13 July 2021 3:58 AM GMTఆదాయాన్ని పెంచుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం వడివడిగా నిర్ణయాల్ని తీసుకుంటోంది. ఖజానా లోటును పన్ను బాదుడుతో పూడ్చుకోవటానికి చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి రావటమే కాదు.. ప్రస్తుతం వచ్చే ఆదాయానికి మరో రూ.3వేల కోట్ల అదనంగా వచ్చేలా ప్లానింగ్ రెఢీ చేశారు. ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగనుంది. దీనికి తోడుగా తాజాగా రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పెంచాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ కానున్నాయి.
మొదటి దశలో భూముల రిజిస్ట్రేషన్ల ఫీజులు పెంచుతారని.. తర్వాత ఇళ్ల రిజిస్ట్రేషన్లు పెంచుతారని చెబుతుంటే.. రెండింటిని ఒకేసారి పెంచుతారని మరికొందరు చెబుతున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ఫీజును ఆస్తి విలువలో 6 శాతం వసూలు చేస్తున్నారు. తాజాగా దాన్ని 7.5 నుంచి 8 శాతం వరకు పెంచే వీలు ఉందని చెబుతున్నారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ఛార్జీలు 7-8 శాతం మధ్యలో వసూలు చేస్తున్న నేపథ్యంలో.. తెలంగాణలో కూడా అదే రీతిలో రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని పెంచాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
దాదాపు ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరగలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెంచితే ప్రజలు భారంగా ఫీల్ కారన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అయితే.. ఈ మధ్యనే భూముల విలువను పెంచటం ద్వారా..రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతున్న వేళలోనే.. రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని పెంచటం సరైనది కాదన్న మాట కొందరిలో వ్యక్తమవుతోంది. ఒకేసమయంలో డబుల్ బాదుడు.. ప్రజల మీద భారంగా మారుతుందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం భారీగా వచ్చే ఆదాయాన్ని కోల్పోవటానికి సిద్ధంగా లేదన్న మాట వినిపిస్తోంది.
ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్ల మీద ఏటా రూ.6వేల కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. అంటే.. నెలకు రూ.500 కోట్లు రిజిస్ట్రేషన్ల రూపంలో వస్తున్నాయి. తాజాగా పెంచిన భూముల విలువ.. తాజాగా వెల్లడి కానున్న రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో నెలకు రూ.250 కోట్లు.. అంటే ఏటా రూ.3000 కోట్లు అదనంగా ఆదాయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా భూముల విలువ పెంచితే.. ఆ కారణంగా కలిగే భారాన్ని ప్రజలు ఫీల్ కారు.
కానీ.. రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని పెంచితే మాత్రం దాన్నో భారంగా ఫీల్ కావటం ఖాయం. ఇది ప్రభుత్వం మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. దీనికి కారణం.. ఎనిమిదేళ్లుగా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచని నేపథ్యంలో.. ఇప్పుడు పెంచినా.. ప్రజలు అర్థం చేసుకుంటారన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే పెంపుకు ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ రోజు (మంగళవారం) జరిగే మంత్రివర్గ సమావేశంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు విషయంలో తుది నిర్ణయాన్ని తీసుకొని.. అధికారికంగా వెల్లడించే వీలుందన్న మాట వినిపిస్తోంది.
ఇప్పటికే పెంచిన భూముల విలువ రిజిస్ట్రేషన్ భారాన్ని తెస్తున్నాయని.. ఛార్జీలు కూడా పెంచితే కలిగే భారం భారీగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. దీనికి ఉదాహరణగా లెక్కలు చూపిస్తున్నారు. మొన్నటి వరకు ఎకరం భూమి విలువ అధికారికంగా రూ.లక్ష ఉంటే.. ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ ఫీజు ప్రకారం రూ.6వేలు కడితే సరిపోయేది. ఇదే ఎకరం భూమి విలువను ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచితే.. ప్రస్తుత వసూలు చేస్తున్న రిజిస్ట్రేషన్ ఛార్జీల ప్రకారమే రూ.30వేలు కట్టాల్సి వస్తుంది. అంటే.. రూ.24వేలు అదనపు భారమన్న మాట. దీనికి తోడు.. ఇప్పటివరకున్న 6 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును 8 శాతానికి పెంచితే.. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.40 వేలు అవుతుంది. అంటే.. మొన్నటివరకు రూ.6వేల ఖర్చు కాస్తా.. తాజాగా తీసుకునే పెంపు పుణ్యమా అని రూ.40వేలు.. అంటే ఒకేసారి రూ.34 వేల భారాన్ని మోపినట్లు అవుతుంది. ఇంత భారీ పెంపు ఒకేసారి అవసరమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరీ.. విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.