Begin typing your search above and press return to search.
బాబు పుణ్యం..బతుకులన్నీ కాంట్రాక్టు మయం
By: Tupaki Desk | 27 March 2017 1:11 PM GMTఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విధానాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ సెటైర్ వేశారు. తనవి ప్రపంచం ఆమోదించే స్థాయి విధానాలని చెప్పుకొనే చంద్రబాబు తీరుపై కేసీఆర్ స్పందిస్తూ అలాంటి పరిపాలన ఇప్పుడు తలనొప్పులు తెచ్చిపెడుతుందన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై కేసీఆర్ మాట్లాడుతూ పరిపాలనలో ఉద్యోగ నియామకాల బదులుగా కాంట్రాక్టు వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదని అన్నారు. చంద్రబాబు పుణ్యమా అని బతుకులన్నీ కాంట్రాక్ట్ అయిపోయాయని, అందుకే తమ శక్తి మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నామని కేసీఆర్ అన్నారు.
హోంగార్డులను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఆశా వర్కర్లకు కూడా త్వరలోనే వేతనాలు పెంచుతామని తెలిపారు. త్వరలోనే గురుకులాల్లో 24 వేల మందిని రిక్రూట్ చేసుకోబోతున్నామని ప్రకటించారు. సంక్షేమ రంగంలోనే దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని కేసీఆర్ ఉద్ఘాటించారు. ``ఒంటరి మహిళలకు జీవన భృతి కల్పిస్తున్నాం. వసతి గృహాల్లో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నాం. గత 60 ఏళ్ల కాలంలో బీడీ కార్మికులను ఎవరైనా గుర్తించారా? మేము 3.7 లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు రూ. 1000 చొప్పున పింఛన్లు ఇస్తున్నాం. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా వారి వివాహాలకు రూ. 75 వేల చొప్పున ఇస్తున్నాం. రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేశాం. ఇది వాస్తవం కాదా?`` అని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాగుందని నిర్ధారణకు వచ్చాకే డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రకటన చేశామన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేస్తామన్నారు. రైతు రుణమాఫీని పకడ్బందీగా అమలు చేసి, రైతులకు 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని కేసీఆర్ వివరించారు.
ఈ సందర్బంగా విద్యార్థుల మెస్ ఛార్జీలను పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీని ద్వారా ఈ ఏడాది సుమారు 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, తమిళనాడు తరహాలో తెలంగాణకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని, సుప్రీంకోర్టును కోరుతామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలను నిర్లక్ష్యం చేయబోమని, అందరికీ సమన్యాయం చేస్తామన్నారు. సగటు మధ్య తరగతివారు తీసుకునే అప్పులు వేరు, ప్రభుత్వాలు తీసుకునే అప్పులు వేరని, అప్పు వచ్చే పరిస్థితి ఉన్నా ఖర్చు చేయకపోతే అది నేరమవుతుందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/