Begin typing your search above and press return to search.
విలేకరుల్ని ఓపెన్ గానే ఏసుకున్న కేసీఆర్
By: Tupaki Desk | 9 July 2016 4:38 AM GMTరాజకీయ నాయకులు చాలానే చెబుతారు. వారు చెప్పే విషయాల్ని తప్పుల్లేకుండా నమోదు చేసి.. వారి వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లటం పాత్రికేయ ధర్మం. తాను వృత్తిధర్మం పాటించే క్రమంలో ఉన్నప్పుడు ఎలాంటి భావోద్వేగాలకు (రాజకీయాలకు సంబంధించి) గురి కాకుండా.. పక్షపాతాలకు పోకుండా సత్యనిష్టతో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కార్యకర్తల మాదిరి.. ప్రజల మాదిరి పంచ్ డైలాగులకు చప్పట్లు కొట్టటం.. విజిల్స్ వేయటం లాంటివి చేయరు. అదే విధంగా స్టేజ్ మీదున్న నాయకుడు ఎంత కదిలించేలా మాట్లాడినా.. నిరాకారంగా వ్యవహరించాలే కానీ.. సదరు నాయకుడు చెప్పిన దానికి తానా అంటే.. తందానా అన్నట్లుగా వ్యవహరించకూడదు. ఇది మంచి అయినా.. చెడు అయినా.. అన్ని విషయాల్లోనూ రిపోర్ట్ చేసే జర్నలిస్ట్ వృత్తి ధర్మాన్ని మీరకూడదు. అదే సమయంలో.. తాము చెప్పే మాటలకు విలేకరులు స్పందించి.. చప్పట్లు కొట్టాలని.. చేతులు ఎత్తేయాలని ఏ రాజకీయ నేతా కోరుకోరు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాస్త భిన్నం. విలేకరులు తమ దారిని తాము ఉండటం ఆయనకు అస్సలు నచ్చనట్లుంది.
టైం చూసి దెబ్బేయాలన్నట్లుగా ఉన్న ఆయన.. తాజాగా విలేకరులపై ఆయన అన్న మాటలు ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యకరంగా ఉండటం గమనార్హం. రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుందో తెలిసేందే. కేవలం రెండు వారాల వ్యవధిలో కోట్లాది మొక్కల్ని నాటే కార్యక్రమానికి తెర తీసిన కేసీఆర్.. తనకు తాను స్వయంగా నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ లో ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. తనదైన శైలిలో భావోద్వేగాల్ని టచ్ చేసేలా మాట్లాడారు.
తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణ మార్చాలని పట్టుపట్టాలని.. పిడికిలి బిగించి.. అనుకున్నది సాధిస్తామని చెబుతూ చేతులు పైకెత్తాలంటూ కేసీఆర్ సూచించారు. రాజకీయ నాయకులు తమ ప్రసంగాల్లో భాగంగా ఇలాంటి మాటలు చెప్పటం.. దానికి అక్కడున్న సభికులు స్పందించటం మామూలే. ఎప్పటిలా జరిగితే ఈ వార్త రాయాల్సిన అవసరమే ఉండేది కాదు. ఇక్కడే కేసీఆర్ తనదైన మార్క్ ను ప్రదర్శించారు.
సభికులంతా పిడికిలి బిగించి చేతులు ఎత్తినా.. పత్రికా విలేకరులు ఎప్పటిలానే ఈ వ్యవహారాన్ని రిపోర్ట్ చేసే బిజీలో ఉన్న వేళ.. కేసీఆర్ రియాక్ట్ అవుతూ.. ‘‘విలేకరులూ.. మీకు చెట్లు వద్దా? పచ్చదనంతో ఉన్న తెలంగాణ వద్దా? పిడికిలి బిగించి చేతులు పైకెత్తరే?’’ అంటూ తనదైన శైలిలో పంచ్ వేశారు. సిమ్మే స్వయంగా టార్గెట్ చేశాక విలేకరులు మాత్రం ఏం చేస్తారు? తమ వృత్తి ధర్మానికి భిన్నంగా పిడికిలి బిగించి చేతులు పైకెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాము చేస్తున్న రిపోర్టింగ్ పనిని వదిలేసి.. పిడికిలి బిగించి చేతులు పైకెత్తటంతో సంతృప్తి చెందిన కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. విలేకరులపై తాజా వ్యాఖ్యలతో కేసీఆర్ చెప్పిందేమిటి? ఇకపై తాను చెప్పే మాటలకు సభికుల మాదిరే స్పందించాలననేనా?