Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ వరం

By:  Tupaki Desk   |   17 Jun 2019 9:28 AM GMT
ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ వరం
X
తెలంగాణ శాసనసభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్ తీపికబురునందించాడు. గద్దెనెక్కగానే వాస్తు ప్రకారం అన్ని భవనాలను మార్చేస్తున్నారు కేసీఆర్. ఆ కోవలోనే సచివాలయం వాస్తు సరిగా లేదని కేంద్రాన్ని ‘పోలో గ్రౌండ్ ’ అడిగాడు. కేంద్రం భూమి ఇవ్వడానికి వెనుకాడడంతో అది నెరవేరలేదు. ఇక అప్పటి వరకు ఉన్న సీఎం కార్యాలయాన్ని వదిలేసి సొంతంగా ‘ప్రగతి భవన్’ ను కట్టేసుకున్నాడు కేసీఆర్. ఇక గవర్నర్ సిబ్బంది కోసం హైక్లాస్ భవనాలను కట్టేశాడు.

ఇక తెలంగాణ ఎమ్మెల్యేలకు కేసీఆర్ తాజాగా వరం ప్రకటించారు. సకల హంగులతో హైదరాబాద్ లోని హైదర్ గూడలో నాలుగున్నర ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దాదాపు 166 కోట్ల వ్యయంతో ఎమ్మెల్యే క్వార్టర్స్ ను నిర్మించాడు. ఎమ్మెల్యేలతోపాటు వారి సిబ్బంది, సర్వెంట్ల కుటుంబాలు కూడా ఉండేందుకు వీలుగా ఈ సముదాయంలో వారికి ప్రత్యేకంగా భవనాలను కట్టించారు. తాజాగా సోమవారం వీటిని లాంఛనంగా ప్రారంభించాడు. ఈ నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలోనే మొదలైనా బాగా ఆలస్యమయ్యాయి.

మొత్తం 119మంది ఎమ్మెల్యేలు.. మరో నామినేటెడ్ ఎమ్మెల్యేకు కలిపి 120 మంది సభ్యులకు ఆరు అంతస్తుల్లో క్వార్టర్లను నిర్మించింది కేసీఆర్ సర్కారు. ఇందులో మొదటి అంతస్తులో కార్యాలయాలు, హెల్త్ సెంటర్, సెకండ్ ఫ్లోర్ లో ఆఫీసులు , ఇండోర్ గేమ్స్, స్టోర్ రూమ్ లు ఏర్పాటు చేశారు.

మొత్తం ఎమ్మెల్యేలకు 120 ప్లాట్లు, ఒక్కోటి 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. ఇందులో త్రిబుల్ బెడ్ రూంలు ఇళ్లు, హాలు, వంటగది, డ్రాయింగ్ రూమ్, విజిటర్ రూమ్ ఉంటాయి.. ఆరు లిఫ్టులు, 5 మెట్ల దారులు ఏర్పాటు చేశారు.