Begin typing your search above and press return to search.

ఈ బిల్లుకి మేము వ్యతిరేకం వెనక్కి తీసుకోండి .. తేల్చేసిన టిఆర్ఎస్

By:  Tupaki Desk   |   11 Dec 2019 11:57 AM GMT
ఈ బిల్లుకి మేము వ్యతిరేకం వెనక్కి తీసుకోండి .. తేల్చేసిన టిఆర్ఎస్
X
బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోని పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు పై టి ఆర్ ఎస్ తన వైఖరి ఏంటో తేల్చేసింది. ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే కేశవరావు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్ సభలో ఈ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందిన విషయం తెలిసిందే ..దీనితో బుధవారం
ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది.

ఈ బిల్లు పై చర్చ సందర్భంగా కేశవరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్ కు లౌకికవాద దేశమనే పేరు ఉందని, దాన్ని చెరిపేసేలా ఈ బిల్లు ఉందని అన్నారు. భారత మూలాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం బిల్లును రూపొందించిందని చెప్పారు. పౌరసత్వ సవరణ బిల్లును తీసుకుని రావడం.. ఒక రకంగా ముస్లింలను వేరు చేసి చూసినట్టే అవుతుందని చెప్పారు. దేశాన్ని ముస్లింల రహితంగా మార్చాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని రూపొందించినట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. భిన్నత్వంలోనే ఏకత్వం అనే భారత మూల సిద్ధాంతాలను తుడిచి పెట్టేలా కనిపిస్తోందని, ఈ బిల్లుని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పరిస్థితుల్లో.. టీఆర్ఎస్ దాన్ని వ్యతిరేకించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అలాగే జీఎస్టీ వసూళ్లలో వాటా కోసం టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఉద్యమించడం వంటి చర్యల వల్ల కేంద్ర ప్రభుత్వంపై తన వైఖరిని ఏమిటో స్పష్టంగా చెప్పినట్టు అర్థమౌతుంది.