Begin typing your search above and press return to search.
కొత్త ప్రాజెక్టులకు తెర తీసిన కేసీఆర్.. తాజాగా ఉత్తర్వులు జారీ
By: Tupaki Desk | 25 Jun 2021 4:30 AM GMTకేంద్రం నుంచి అనుమతులు తీసుకోకుండా.. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులను షురూ చేసిందని.. దీని వల్ల తెలంగాణ ప్రయోజనాలు భారీగా దెబ్బ తింటాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేయటం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులతో దక్షిణ తెలంగాణకు ఇబ్బంది అని చెబుతున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పటమే కాదు.. సర్వేకు ఉత్తర్వులు జారీ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో క్రిష్ణా జలాల్ని ఏపీ అక్రమంగా వాడుకుంటుందంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయటం.. పోరాడతామని చెప్పటం తెలిసిందే. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. రెండు రాష్ట్రాల్లో ఏది కూడా తనకు తాను సొంతంగా కొత్త ప్రాజెక్టులకు నిర్ణయం తీసుకోకూడదు. కేంద్రం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా సర్వేకు ఆదేశాలు జారీ చేయటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.
తెలంగాణ ప్రభుత్వం సర్వేకు ఆదేశించిన కొత్త ప్రాజెక్టు పనులు ఏవంటే..?
- శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్‌లో జోగుళాంబ బ్యారేజీ నిర్మాణం. 35 నుంచి 40 టీఎంసీలు నిల్వ.
- భీమా నదికి వరద వచ్చే రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ తరలించేలా నారాయణపేట జిల్లా కుసుమర్తి గ్రామం నుంచి వరద కాలువ తవ్వుతారు. ఈ కాలువ ద్వారా జూరాల ప్రాజెక్టు పరిధిలోని గోపాలదిన్నె రిజర్వాయర్ వరకు చెరువులు, రిజర్వాయర్లు నింపటమే లక్ష్యం.
- ఆర్డీఎస్, నెట్టెంపాడు ఎత్తిపోతల గ్యాప్ ఆయకట్టుకు నీళ్లివ్వడానికి సుంకేశుల బ్యారేజీ బ్యాక్ వాటర్‌లో కొత్త ఎత్తిపోతల పథకం. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు దీని ద్వారా నీళ్లు ఇవ్వాలన్నది లక్ష్యం.
- కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలో కొత్తగా 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మాణం
- పులిచింతల డ్యాం ఫోర్‌షోర్‌లో ఎత్తిపోతల పథకంతో నల్లగొండ జిల్లాలోని అప్‌ల్యాండ్ ప్రాంతాల్లోని 2 లక్షల ఎకరాలకు నీరు ఇస్తారు
- నాగార్జునసాగర్ టెయిల్ పాండ్‌లో ఎత్తిపోతల పథకం నిర్మించి కాల్వ చివరి, ఎగువ ప్రాంతాల్లోని లక్ష ఎకరాలకు నీరు ఇవ్వటం లక్ష్యం.