Begin typing your search above and press return to search.
సీక్రెట్ మీటింగ్ లో కేసీఆర్ చెప్పిందిదే!
By: Tupaki Desk | 25 Aug 2018 5:30 PM GMTముందస్తుపై తెలంగాణలో తీవ్రమైన రాజకీయ చర్చ జరుగుతున్న వేళ.. పార్టీ ఎంపీలు..మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కమ్ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారు? ఏం మాట్లాడారు? పార్టీ నేతలకు ఎలాంటి భరోసా ఇచ్చారు? ముందస్తుపై ఆయన ఎలాంటి సంకేతాలు ఇచ్చారు? లాంటి ప్రశ్నలకు క్లారిటీతో సమాధానాలు ఇచ్చారని చెప్పాలి. ఆయనేం అన్నారన్న దానిపై విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన వివరాలు చూస్తే..
+ ఎన్నికల సంగతి నాకు వదిలిపెట్టండి. నేను చూసుకుంటాను. ఎన్నికలు మూడు నెలల్లో రావచ్చు. ఆరు నెలల్లో రావచ్చు. ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. పార్టీ అభ్యర్థుల పేర్లను సెప్టెంబరు ఆఖరులోగా ప్రకటిస్తా. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వందకుపైగా స్థానాల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తాను. రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుంది.
+ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వందకుపైగా స్థానాల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తాను. ఆ బాధ్యతను స్వయంగా నేనే తీసుకుంటాను. రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుంది
+ ప్రగతి నివేదన సభలో ఉర్దూకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కోరారు. అందుకు కేసీఆర్ సరేనన్నారు.
+ పత్రికల్లో ముందస్తు.. గిందస్తు అని రాస్తున్నారు. అవన్నీ పట్టించుకోకండి. ఎన్నికలు మూడు నెలల్లో రావచ్చు. ఆరు నెలల్లో రావచ్చు. ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి
+ వచ్చే ఎన్నికలకు చాలామంది సిట్టింగ్‌లను మారుస్తామని ప్రచారం జరుగుతోంది. అది కరెక్ట్ కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తాం. ఈ విషయంలో ఎవరూ భయపడవద్దు. అయితే, ముగ్గురు, నలుగురి పరిస్థితి స్థానికంగా ఇబ్బందికరంగా ఉంది.
+ తిరిగి టికెట్లు ఇవ్వకుండా వారిని తప్పించినా దూరం చేసుకోబోం. కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను. ఎమ్మెల్సీ, ఇతర సమానమైన పదవులు ఇచ్చి గౌరవప్రదంగా చూసుకుంటాను. అన్యాయం చేసేది లేదు. వారెవరూ అధైర్యపడొద్దు
+ ఇప్పటికే 14 సర్వేలు చేయించాను. అన్నింట్లో మనదే అధికారమని తేలింది. 101 సీట్లు పక్కా గెలుస్తాం. 70 శాతం ఓట్లతో గెలిచే స్థానాలు 17 ఉన్నాయి. 60 శాతం ఓట్లతో 50కుపైగా గెలుస్తాం. 5 వేల నుంచి 10 వేల మెజారిటీతో గెలిచే సీట్లు నాలుగైదు ఉన్నాయి. సర్వే ఫలితాలు వచ్చిన తర్వాత హనుమంత్ షిండే (జుక్కల్)కు నేనే ఫోన్ చేశా. సర్వేలో మంచి ఫలితం వచ్చింది. ఎంత మెజారిటీ వస్తుందని అడిగా. 50 వేలు వస్తుందని చెప్పారు.
+ ఆయనొక్కరే కాదు.. తెలంగాణలోని పాతిక మంది ఎమ్మెల్యేలతో మాట్లాడా. సర్వే ఫలితాలకు వారు చెప్పిన వివరాలకు సరిపోయింది.
+ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 60-70 స్థానాల్లో 50 వేల మెజారిటీ వస్తుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఏడు స్థానాలు మినహాయిస్తే, మిగిలిన స్థానాల్లో మనకు పోటీగా నిలబడే సత్తా ఉన్న అభ్యర్థులే లేరు. ఇక్కడ చక్కటి ఫలితాలు వస్తాయి.
+ ప్రగతి నివేదన సభకు 20-25 లక్షలకు తగ్గకుండా జనం రావాలి. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ సభ ఉండాలి. , ఇందుకు అవసరమైన జన సమీకరణ చేయాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 20-25 వేల జనాన్ని తీసుకురావాలి.
+ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వివిధ వర్గాలు సైకిల్ - మోటారు సైకిల్ - ట్రాక్టర్లు - లారీల ద్వారా సభకు తరలి రావటానికి ఆసక్తి చూపుతున్నారన్న పలువురు ఎమ్మెల్యేల మాటలకు స్పందించిన కేసీఆర్ వారంతా సెప్టెంబరు ఒకటో తేదీ రాత్రికి లేదా రెండో తేదీ ఉదయానికి సభాస్థలి కొంగర్ కలాన్‌కు చేరేలా ఏర్పాట్లు చేసుకోండి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోండి.