Begin typing your search above and press return to search.
ఫ్లాష్ సర్వే రిపోర్ట్ కేసీఆర్ కు ఏం చెప్పింది?
By: Tupaki Desk | 14 Nov 2015 5:48 AM GMTసాఫీగా సాగిపోవాల్సిన వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం.. ఊహించని విధంగా ఉండటం.. తెలంగాణ అధికారపక్షం నేతలు ఎక్కడకు వెళితే అక్కడ ప్రజలు నిలదీయటం.. ప్రశ్నించటం.. నిరసన వ్యక్తం చేయటం లాంటి వాటితో షాకుల మీద షాకులు తగులుతున్న పరిస్థితి. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఒకరో.. ఇద్దరికో కాకుండా.. టీఆర్ ఎస్ కు చెందిన అగ్ర నేతలకు సైతం ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతున్న వేళ.. అధినాయకత్వం ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది.
అసలు వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందన్న విషయంపై ఆందోళన మొదలైంది. విజయంపై ఎలాంటి సందేహం లేదని.. మెజార్టీ మీదనే దృష్టి పెట్టాలన్న ధీమాను వ్యక్తం చేసిన గులాబీనేతలు.. వరంగల్ ప్రచారంలో చోటు చేసుకుంటున్న ఇబ్బందికర పరిస్థితి వెనుకున్న అసలు కారణంపై దృష్టి సారించారు. ఇందుకోసం ఫ్లాష్ సర్వే ఒకటి నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నా.. ఇలాంటి వ్యతిరేకత ఎందుకు వస్తుందన్నది ఇప్పుడు వారికి పెద్ద ప్రశ్నగా మారింది.
స్వల్ప వ్యవధిలో భారీగా చేయించిన సర్వే ఫలితాలు గులాబీ అధినాయకత్వానికి షాకిచ్చాయని చెబుతున్నారు. ప్రచార సందర్భంగా ఎదురవుతున్న నిరసన మొత్తం.. ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా చేస్తున్నారన్న సందేహాలు గులాబీ నేతలు వ్యక్తం చేసినా.. ఫ్లాష్ సర్వే మాత్రం ఆ అంచనా ఫూర్తిగా తప్పని తేల్చినట్లుగా చెబుతున్నారు. వరంగల్ లోక్ సభా నియోజకవర్గ ప్రజల్లో అసంతృఫ్తి ఉందని.. అందుకు పలు కారణాల్ని ఫ్లాష్ సర్వే బయటకు తెచ్చినట్లుగా తెలుస్తోంది.
ఉప ఎన్నిక సజావుగా సాగిపోయి.. తెలంగాణలో తమకు తిరుగులేని ఆదరణ ఉందని అందరికి చెప్పుకోవచ్చని ధీమాగా ఉన్న సమయంలో అనుకోని విధంగా ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితిని ఎలా అధిగమించాలన్న అంశంపై టీఆర్ ఎస్ అధినాయకత్వం ఇప్పుడు దృష్టి పెట్టింది.
వరంగల్ ఓటర్లను బుజ్జగించేందుకు అవసరమైన చర్యల్ని తీసుకోవాలని ఆదేశించిన కేసీఆర్.. తాను చేయించిన ఫ్లాష్ సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగా వ్యతిరేకతను ఎలా తగ్గించాలన్న కోణంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల్లో అసంతృప్తికి ముఖ్యకారణాల్లో ఒకటి.. పత్తికి గిట్టుబాటు ధర లభించకపోవటంగా చెబుతున్నారు. నిజానికి ఈ అంశం రాష్ట్ర పరిధిలోని అంశం కాదు. పూర్తిగా కేంద్రానికి సంబంధించింది. అయితే.. ఆ విషయాన్ని ఇప్పటివరకూ ప్రచారం చేయకపోవటం.. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవటంపై ప్రజలు అగ్రహంగా ఉన్నట్లుగా తేల్చారు. దీనికి తోడు.. ఉప ఎన్నిక జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికం పత్తి పంట పండించే వారు ఉండటం గమనార్హం.
దీనికి తోడు.. ఫించన్ల పంపిణీ కార్యక్రమం సరిగా లేకపోవటం.. దళితులకు ఇస్తామని చెప్పిన మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం మీదా గుర్రుగా ఉన్నట్లు తేల్చారు. చైతన్యానికి మారుపేరుగా చెప్పే వరంగల్ ప్రజల అగ్రహాన్ని యుద్ధ ప్రాతిపదిక చల్లార్చటానికి ఏమేం చేయాలన్న అంశంపై గులాబీ దళం దృష్టి పెట్టింది. ప్రజల్లో అసంతృప్తికి కారణమైన అంశాలకు సంబంధించి ప్రజల్ని బుజ్జగించేలా చేయటంతో పాటు.. చాలా విషయాలు తమకు సంబంధం లేనివని చెప్పటం ద్వారా ప్రజలకు తమ మీద ఉన్న అగ్రహాన్ని తగ్గించేలా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి.. గులాబీ అధినేత ఫ్లాష్ సర్వే ఫలితం ఎంతవరకు అక్కరకు వస్తుందో.. వరంగల్ ఉప ఎన్నిక ఫలితం వెల్లడయ్యాక కానీ స్పష్టం కాదని చెప్పొచ్చు.