Begin typing your search above and press return to search.

మునుగోడు కోసం సీపీఐ మద్దతు కోరిన కేసీఆర్

By:  Tupaki Desk   |   20 Aug 2022 6:57 AM GMT
మునుగోడు కోసం సీపీఐ మద్దతు కోరిన కేసీఆర్
X
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్నారు. నల్గొండలో బలంగా ఉన్న కమ్యూనిస్టులను దరికి చేర్చుకునేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు.

ఈ క్రమంలోనే నిన్న రాత్రి రెండుగంటల పాటు సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకట్ రెడ్డిలు స్వయంగా సీఎం కేసీఆర్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని సీఎం వారిని కోరారు.

తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తామని సీపీఐ నేతలు హామీ ఇచ్చారు. సీఎంతో చర్చించిన అంశాలపై కార్యదర్శి వర్గంతో నేతలు ఇవాళ ఉదయం 10.30 గంటలకు సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశంలో సీపీఐ నేతలు అధికారికంగా ప్రకటించనున్నారు.

మరోవైపు మునుగోడు సభకు రావాలని సీపీఐ నేతలను సీఎం కోరగా.. సభలో పాల్గొనేందుకు సీపీఐ అంగీకరించింది. టీఆర్ఎస్ మునుగోడు సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి పాల్గొననున్నారు.

మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదన్న ఆలోచనలో సీపీఐ-సీపీఎంలు ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. కాబట్టి కాంగ్రెస్ ఓట్లు రెండుగా చీలడం ఖాయమని.. ఒకవేళ కాంగ్రెస్ కు వామపక్షాలు మద్దతు ఇచ్చినా బీజేపీనే లాభపడుతుందని విశ్లేషిస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీని ఎదుర్కొనే టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం కొంత మంచిదని సీపీఐ నిర్ణయించుకున్న్టు తెలిసింది.

సీపీఐ, సీపీఎంలకు మునుగోడులో 25వేలకు పైగా ఓటింగ్ మద్దతు ఉంది. విజయావకాశాలను ప్రభావితం చేసేస్తాయిలో కమ్యూనిస్టులు ఉన్నారు. అందుకే ఇలా కేసీఆర్ స్వయంగా వారిని శరణు వేడినట్టు తెలుస్తోంది.