Begin typing your search above and press return to search.

ఢిల్లీ కోటను బద్దలుకొడుతా.. మోడీపై మళ్లీ చెలరేగిన కేసీఆర్

By:  Tupaki Desk   |   11 Feb 2022 4:30 PM GMT
ఢిల్లీ కోటను బద్దలుకొడుతా.. మోడీపై మళ్లీ చెలరేగిన కేసీఆర్
X
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి చెలరేగిపోయారు. ఢిల్లీ కోటను బద్దలుకొడుతానంటూ రెచ్చిపోయారు. జనగామ జిల్లా పర్యటనలో కలెక్టరేట్ సహా అభివృద్ధి పనులు ప్రారంభించిన కేసీఆర్ ఈ మేరకు కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఖబడ్దార్ మోడీ అంటూ ఫైర్ అయ్యారు.

తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే ఢిల్లీ కోటను బద్దలు కొడుతామని.. ఖబడ్దార్ మోడీ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. పిడికెడ్ లేని బీజేపీ నేతలు తమ జోలికొస్తే ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జనగామ జిల్లా యశ్వంత్ పూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నామని పేర్కొన్నారు. తమను ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో రైతులను మోసం చేస్తే ఊరుకోబోమని తేల్చిచెప్పిన కేసీఆర్.. తమ ప్రాణం పోయినా సరే బావుల వద్ద మోటార్లకు కరెంట్ మీటర్లు పెట్టమని స్పష్టం చేశారు.

ఎనిమిదేళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకుండా ఎదిగామని పేర్కొన్న కేసీఆర్.. దేశంలో అనేక రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని వెల్లడించారు.

తెలంగాణ పులిబిడ్డగా అవసరమైతే ఢిల్లీ కోటను బద్దలు కొడుతామని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని పేర్కొన్న కేసీఆర్.. ఉన్నవాటితోనే సర్దుకున్నామని.. ఆదాయాన్ని సృష్టించామన్నారు. కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, రైల్వే జోన్లు ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని.. రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.

టీఆర్ఎస్ యుద్ధం చేసి గెలిచిన పార్టీ అని పేర్కొన్న కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని.. తెలంగాణ పులిబిడ్డగా అవసరమైతే ఢిల్లీ కోటను బద్దలు కొడతాం అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోడీ ఉడుత ఊపులకు , పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణ పులిబిడ్డ అని చెప్పుకున్న కేసీఆర్.. బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని హెచ్చరికలు జారీ చేశారు.

జనగామలో టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు కొట్టారని.. అయినప్పటికీ తాము బీజేపీ కార్యకర్తలను టచ్ చేయమని కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ బిడ్డలారా.. మమ్మల్ని ముట్టుకుంటే మసి చేస్తామంటూ హెచ్చరించారు. మేము ఊదితే మీరు అడ్రస్ లేకుండా పోతారంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు.