Begin typing your search above and press return to search.
కాళేశ్వరం ప్రారంభవేళ.. కేసీఆర్ సంచలన ప్రకటన!
By: Tupaki Desk | 16 Jun 2019 5:10 AM GMTతెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడో అంశం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తన కలల ప్రాజెక్టుగా అదే పనిగా చెప్పే కాళేశ్వరం ఈ నెలలో ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇంత భారీ ప్రాజెక్టును కేంద్ర సాయం లేకుండా.. తెలంగాణ సర్కారు తన సొంతంగా నిర్మించటం మామూలు విషయం కాదు. తక్కువ వ్యవధిలో పరుగులు పెట్టించి మరీ పని పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చి.. అనుకున్నట్లే పని చేస్తే.. తెలంగాణ రూపురేఖలు మారిపోవటమే కాదు.. సరికొత్త తెలంగాణ ఆవిష్కృతం కావటం ఖాయం.
దేశంలో ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నాయి కానీ.. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు లేదనే చెప్పాలి. అందునా ఒక రాష్ట్ర ప్రభుత్వం తనకు తానే పూర్తి చేసుకోవటం తెలంగాణకే చెల్లిందని చెప్పాలి. ఇంతటి చారిత్రక దినాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి సంచలన ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉందన్న మాట అంతకంతకూ పెరుగుతోంది.
తన రాజకీయ వారసుడైన కేటీఆర్ కు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇచ్చేసిన కేసీఆర్.. అధికార బదిలీని కూడా ఇప్పుడే చేపడితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల షాక్ ను ఇటీవల విడుదలైన స్థానిక ఎన్నికల ఫలితాలు సరి చేసిన నేపథ్యంలో.. అట్టే ఆలస్యం చేయకుండా కేటీఆర్ చేతికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చేందుకు అవసరమైన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల్లో అనుకున్నట్లే సెంట్రల్ లో ఫెడరల్ ఫ్రంట్ కానీ.. థర్డ్ ఫ్రంట్ అవసరం ఏర్పడిన పక్షంలో తాను ఢిల్లీకి వెళ్లిపోయి.. రాష్ట్ర పాలనా బాధ్యతల్ని కేటీఆర్ కు అప్పజెప్పాలన్న ప్లాన్ ను కేసీఆర్ ఎప్పుడో రెఢీ చేశారు. అయితే.. అనుకోని రీతిలో మోడీకి తిరుగులేని మెజార్టీ రావటంతో కేటీఆర్ కు పట్టాభిషేకం చేసే అవకాశం మిస్ అయ్యింది. ఇక.. ఆలస్యం చేస్తే బాగోదని.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంలో తనకంతా సానుకూల వాతావరణమే ఉంటుందన్న ఆలోచనలో ఉన్న కేసీఆర్.. తన వారసుడన్న మాటతో పాటు.. అధికార బదిలీకి సంబంధించిన కీలక ప్రకటన చేసే వీలుందని చెబుతున్నారు. మరీ సంచలన ప్రకటన మాట వాస్తవ రూపం దాలుస్తుందా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.