Begin typing your search above and press return to search.

చిన్న డౌట్.. 100 ఎకరాలు ఉన్నోళ్లను రైతు అంటారా కేసీఆర్

By:  Tupaki Desk   |   11 Nov 2021 3:30 AM GMT
చిన్న డౌట్.. 100 ఎకరాలు ఉన్నోళ్లను రైతు అంటారా కేసీఆర్
X
దేశంలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం బాజాప్తా నాకు.. నా కొడుక్కి కలిపి వంద ఎకరాల భూమి ఉంది. ఎంచక్కా వ్యవసాయం చేస్తున్నాం. మాకు అక్కడ ఉంది ఫాంహౌస్ కాదు.. పార్మర్ హౌస్.. అంటూ సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెలరేగిపోవటం తెలిసిందే. విన్నంతనే అంతా బాగున్నట్లుగా అనిపించే ఆయన మాటలు.. లోతుల్లోకి వెళ్లే కొద్దీ మాత్రం తేడా కొట్టేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే.. ఆయన మాటలు విన్నప్పుడు కలిగే పరిస్థితి.

తనకు.. తన కుమారుడు కేటీఆర్ కు కలిపి వ్యవసాయ క్షేత్రంలో వంద ఎకరాలు ఉందన్న మాటను ఓపెన్ గా చెప్పేసి కేసీఆర్ మాటల్ని విన్న వారందరికి.. తండ్రి కొడుకులకు వంద ఎకరాలు ఉంటే.. వారిని కూడా రైతు అనేస్తారా? అన్న సిన్న డౌట్ కొట్టేస్తుంది. సాధారణంగా పది ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న వారిని రైతుగానే అనేసేవారు. పాతిక.. యాబై ఎకరాలు దాటేస్తే మాత్రం రైతు అనే కంటే.. మోతుబరి రైతు అంటూ పిలవటం గ్రామాల్లో కనిపిస్తూ ఉండేది.

ఒకప్పుడు వంద ఎకరాలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు. కానీ.. మారిన పరిస్థితులు.. పెరిగిన ధరల నేపథ్యంలో వంద ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. అందునా.. వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో.. కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి నిర్మించిన ఇంటిని ఫార్మర్ హౌస్ అంటారా? లేక.. ఫామ్ హౌస్ అంటారా? అన్నది మరింత క్లారిటీ తెచ్చుకోవాల్సిన అంశమే అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ వ్యవసాయం చేయటాన్ని అభినందించాల్సిన అంశమే. కాకుంటే..వంద ఎకరాల్లో సాగు వ్యవసాయం సంప్రదాయ వ్యవసాయం అంటారా? లేదంటే కార్పొరేట్ వ్యవసాయం అంటారా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది.

మనసుకు తోచినట్లుగా మాట్లాడం తప్పేం కాదు. కానీ.. వాస్తవం అనేది ఒకటి ఉండటం.. బుర్రలో గుజ్జు ఉన్నోళ్లలో లాజిక్ అనేది ఒకటి ఉండి.. ప్రెస్ మీట్ వేళ.. కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలకు ఎదురు ప్రశ్నలు మెదడులో మెదలటం దేనికి నిదర్శనమంటారు? అన్నది మరో క్వశ్చన్. వంద ఎకరాలు ఉండి మందిని పెట్టి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి.. తనను రైతుగానే గుర్తించాలని సీఎం కేసీఆర్ అనుకోవచ్చు. కాకుంటే.. అలాంటిస్థాయి ఉన్న రైతును మోతుబరి అంటారన్న విషయాన్ని కేసీఆర్ అంగీకరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు.