Begin typing your search above and press return to search.
తెలంగాణలో నిరుద్యోగ సమస్యకు ఏపీనే కారణం.. కేసీఆర్ సెంటిమెంటు వ్యాఖ్యలు
By: Tupaki Desk | 9 March 2022 7:38 AM GMTసెంటిమెంటు రాజకీయాలకు కేంద్రంగా ఉన్న కేసీఆర్.. ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు.. ఏపీపై విరుచుకుపడడం, తద్వారా లబ్ధి పొందడం కామన్‌గా మారిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆయన చుట్టూ బిగుసుకున్న నిరుద్యోగ సమస్య ఉచ్చు నుంచి బయటపడేందుకు వ్యూహాత్మకంగా ఏపీపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోవడానికి ఏపీనే కారణమని.. మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు.
ఉద్యోగుల విషయంలో ఏపీది అర్ధరహితమైన వాదన అని.. ఆరోపించారు. ఉద్యోగుల విభజనపై కొర్రీలు పెడుతున్నారని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యపై సుప్రీంకోర్టుకు వెళ్లిందని చెప్పారు. నియామకాలపై అర్ధరహిత వివాదాలు సృష్టించారని అన్నారు. వివాదాలను ఏపీ ప్రభుత్వం తెగనివ్వడం లేదని మండిపడ్డారు. వివాదాలు తెగకపోవడం వల్లే.. ఉద్యోగాల భర్తీ చేపట్టలేకపోయామని అన్నారు.
తెలంగాణ ఆస్తుల విషయంలోనూ వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. తెలంగాణలోని ఆర్టీసీ ఆస్పత్రిలో వాటా కోరుతున్నారన్నారు. ఈ వివాదాలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు. తెలంగాణకు నీళ్ల వాటా కోసం ఇప్పటికీ పోరాడుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో నీళ్లు, విద్యుత్ సమస్యలు పరిష్కరించుకున్నామని.. అద్భుతంగా పంటలు పండుతున్నాయని వివరించారు. చివరికి రాష్ట్రంలో పంటలను కొనలేమని కేంద్రమే చేతులెత్తేసిందన్నారు.
14 ఏళ్ల సుదీర్ఘ ఘర్షణ తర్వాత తెలంగాణ సాకారమైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ తనను తాను నిర్వచించుకోవాలని ఆకాంక్షించారు. రాజకీయాలంటే తమకు పవిత్రమైన కర్తవ్యమని.. ఉద్యమ సందర్భంగా ఏం చేశామో ప్రజలకు తెలుసన్నారు. ఇటీవలి వరకు టీఆర్ ఎస్ నేతలు రైల్వే కేసులు ఎదుర్కొన్నారన్నారు. రాష్ట్రాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లడంలో సఫలమయ్యామన్నారు.
"తెలంగాణ నినాదం.. నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ భాష అంటే ఒకప్పుడు హాస్యాస్పదంగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ భాష పెడితేనే సినిమా హిట్ అవుతోంది. తెలంగాణ సంస్కృతి, పండుగల ను కాపాడుకున్నాం. సమ్మక్క-సారక్క జాతర, సేవాలాల్ జయంతి అధికారికంగా జరుపుతున్నాం. ఉద్యోగుల విషయంలో ఏపీది అర్ధరహితమైన వాదన. ఉద్యోగుల విభజనపై కొర్రీలు పెడుతున్నారు. తెలంగాణ ఆస్తుల విషయంలో వివాదాలు సృష్టిస్తున్నారు.`` అనికేసీఆర్ వ్యాఖ్యానించారు.