Begin typing your search above and press return to search.

చంద్రబాబు జేజమ్మ కూడా ఏం చేయలేదు

By:  Tupaki Desk   |   10 Jun 2015 7:11 PM GMT
చంద్రబాబు జేజమ్మ కూడా ఏం చేయలేదు
X
ఏపీ సీఎం చంద్రబాబు కాదు కదా...ఆయన జేజమ్మ కూడా తననేం చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు దొరికిన దొంగ అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఫిర్యాదుతోనే ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ రంగంలోకి దిగిందని కేసీఆర్ తెలిపారు.

మీడియా సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు...

- తన ఫోన్ ఒకసారి ట్యాప్ చేశారని, ఇంకోసారి కట్ అండ్ పేస్ట్ అని చంద్రబాబు అంటున్నరు. ఏది నిజం?

- మీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్ హ్యాండడ్‌గా దొరికాడా లేదా? అది చెప్పు.

- చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడారా లేదా.

-120 మంది ఫోన్లు ట్యాప్ చేస్తే మే 31 వరకు ఏపీ ప్రభుత్వం ఏం చేసింది?

- రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారం వెలుగు చూసిన తర్వాతే ట్యాపింగ్ గుర్తుకు వచ్చిందా?

- ఫోన్లను ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?

- టేపులు బయటకి రావడం అనేది ఫ్రీడం ఆఫ్ ప్రెస్.

- అవినీతి వ్యవహారంలో ఇరుక్కున్న చంద్రబాబును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాపాడుతారని నేను అనుకోవడం లేదు.

- ఈ వ్యవహారంపై కేంద్రం నుంచి నాకెవరూ ఫోన్ చేయలేదు

- కుమ్మక్కులకు చంద్రబాబు పెట్టింది పేరు. చేసిన తప్పుడుపని కప్పిపుచ్చుకోవడానికి బాబు ప్రయత్నిస్తున్నడు. అందుకే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నడు.

- వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబుకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదా?

- ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత ఎక్కడున్నారు చెప్పు? బాబు చేస్తే మంచి పని. మేం చేస్తే చెడ్డదా?

- మొదలు బాబు వాటికి జవాబిస్తే..మిగతాది తర్వాత చెప్పుకుందాం.

- ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ కొంటే నేనే అప్రమత్తం చేశా.

- ఐదు ముఠాలు ఏర్పాటు చేసి బేరసారాలకు టీడీపీ దిగింది.

- బంగారు లక్ష్మణ్ వ్యవహారంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు

- బాబు బేరసారాలు నడిపిందని స్పష్టంగా తెలుస్తోంది కదా!

- అన్ని విషయాలు విచారణలో బయట పడతాయి. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు

- నేరస్థుల్ని ప్రభుత్వం అరెస్ట్ చేయదు. అరెస్ట్ చేయడానికి ప్రత్యేక శాఖలు ఉన్నాయి.

- చంద్రబాబు బాగోతం చాలావుంది, సరైన సమయంలో మరిన్ని వివరాలు బయటపెడతాం