Begin typing your search above and press return to search.

మహమ్మారి వ్యాప్తి పై కేసీఆర్ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   15 May 2020 7:45 AM GMT
మహమ్మారి వ్యాప్తి పై కేసీఆర్ సంచలన నిర్ణయం
X
తెలంగాణలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యాప్తిని కంట్రోల్ చేద్దామని ఎంత చూసినా విస్తరిస్తూనే ఉన్న నేపథ్యంలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

ప్రస్తుతం హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో కేసుల సంఖ్య నామమాత్రంగానే ఉంది. దీంతో లైట్ తీసుకోకుండా సీఎం కేసీఆర్ పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇక నుంచి కరోనా వైరస్ పై ప్రజలు ఆస్పత్రులకు రావడం కాకుండా.. వైద్య సిబ్బందే ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

తాజాగా వైద్యాధికారులు, ఆస్పత్రుల సూపరిటెండెంట్లు, మెడికల్ ఆఫీసర్స్ తో మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ తర్వాత కేసీఆర్ తో చర్చించి ప్రతీ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యసిబ్బందిని మంత్రి ఈటల ఆదేశించారు. ఒక్కో ఏఎన్ఎంకు 100 ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక తెలంగాణలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి , ఊపిరితిత్తుల్లో న్యుమోనియా వంటి లక్షణాలు ఉన్న వారికి తప్పనిసరిగా పరీక్షలు చేయాలని మంత్రి సూచించారు. తెలంగాణ ప్రజలందరికీ మూడు, నాలుగు రోజుల్లోనే వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.