Begin typing your search above and press return to search.

లక్ష కోట్టు: ప్రపంచానికే ఆదర్శ పథకమట

By:  Tupaki Desk   |   25 July 2021 4:18 AM GMT
లక్ష కోట్టు: ప్రపంచానికే ఆదర్శ పథకమట
X
హుజూరాబాద్ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ మరో భారీ పథకాన్ని ప్రవేశపెట్టారు. పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నే ఎన్నుకోవడం విశేషం. తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఈ పథకం ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక విపక్షాల నుంచి విముక్తులను చేయబోతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.

దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం ఉంటుందని అన్నారు.

అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని.. దశల వారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80వేల కోట్ల నుంచి రూ.1 లక్షల కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే ఈ దళిత బంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతున్నదని సీఎం తెలిపారు.అందుకు పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేద్దామని.. సంఘాల నేతలకు, దళిత ప్రజాప్రతినిధులకు మేధావులకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

తాజాగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను కేసీఆర్ నియమించారు.ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు హుజూరాబాద్ నుంచి వచ్చిన దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు ప్రగతిభవన్ కు తరలివచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని ఉద్దేశించి సమావేశంలో మాట్లాడుతూ ఈ భారీ ప్రకటనలు చేశారు.