Begin typing your search above and press return to search.
కేసీయార్ ఇంత సీరియస్ గా ఉన్నారా ?
By: Tupaki Desk | 16 Dec 2021 4:51 AM GMTకేంద్ర ప్రభుత్వ వైఖరిపై కేసీయార్ నిజంగా సీరియస్ గా ఉన్నారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. వరి కొనుగోలు విషయంలో తెలంగాణా విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపిస్తోందని ఈ మధ్య కేసీయార్ తరచూ మండిపోతున్న విషయం అందరూ చూస్తున్నదే.
ఇదే విషయమై గడచిన నెలరోజులుగా కేంద్రంపై అనేకసార్లు మీడియా సమావేశాలు పెట్టి మరీ తన కోపాన్ని ప్రదర్శించారు. తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ భేటీలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ ను వ్యక్తిగతంగానే కాకుండా పరిపాలనపై కూడా బీజేపీ బాగా దూకుడు మీద వెళుతోంది. పరిపాలనను కాకుండా బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యక్తిగతంగా సీఎం వెంటపడుతున్నారు.
దీంతో కేసీయార్ కు బాగా ఇరిటేషన్ పెరిగిపోతోంది. కావాలనే బీజేపీ నేతలు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారనే ఫ్రస్ట్రేషన్ కేసీయార్లో పెరిగిపోతోంది. అందుకనే కేసీయార్ కూడా బీజేపీని పూర్తిగా టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారు.
బీజేపీపై అనుసరించాల్సిన వ్యూహాన్ని డిసైడ్ చేయటానికి శుక్రవారం ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కాబోతున్నారు. గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకు బీజేపీని ఎటాక్ చేయటమే లక్ష్యంగా నేతలకు కేసీయార్ దిశాదశ నిర్దేశించనున్నారు.
మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా పార్టీని సమాయత్తం చేయటానికి కూడా శుక్రవారం సమావేశం ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈనెల 19వ తేదీ నుంచి కేసీయార్ జిల్లాల్లో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి నరేంద్ర మోడీ వ్యవహారశైలిపై మండిపోయే అవకాశాలున్నాయి.
తనను బీజేపీ నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న కారణంగా టీఆర్ఎస్ వర్గాలు కూడా మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనేది గులాబి బాస్ ప్లాన్ గా అర్ధమవుతోంది. ఏదేమైనా జనాల్లో కమలనాదులను బూచిగా చూంపించేందుకు కారు పార్టీ కార్యాచరణ రెడీ చేస్తున్నట్లు అర్ధమవుతోంది.
ఇంత జరుగుతున్నా నిజంగానే కేంద్రప్రభుత్వం+బీజేపీపై కేసీయార్ ఆగ్రహం సీరియస్సేనా అనే డౌటు వస్తోంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే చాలాసార్లు కేంద్రంపై దండయాత్రని ఒకసారి కేంద్రంపై యుద్ధమని చాలా భీకరంగా ప్రకటించారు.
ఆ తర్వాత అంతా తుస్సుమనిపించారు. అందుకనే ఇపుడు కేసీయార్ ఇంతగా మాట్లాడుతున్నా గులాబీ శ్రేణుల్లో ఎక్కడా కాస్త అనుమానాలున్నాయి. జిల్లాల టూర్లలో ఏమి జరుగుతుందో చూడాలి.