Begin typing your search above and press return to search.
యావత్ తెలంగాణ జల్లెడ పట్టిస్తున్న కేసీఆర్?
By: Tupaki Desk | 17 March 2020 6:15 AM GMTముప్పు గురించి తెలీనంతవరకూ ఓకే. కానీ.. ఒకసారి దాని తీవ్రత మీద అవగాహన వచ్చిన తర్వాత దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారు ముందుంటారు. కరోనా గురించి తనకు పెద్దగా తెలీదని ఓపెన్ అసెంబ్లీ లో చెబుతూ.. తనకో శాస్త్రవేత్త ఫోన్ చేసిన కరోనా మీద ఫికర్ అక్కర్లేదని.. సింఫుల్ గా పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని చెప్పారని.. తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ అభయాన్ని ఇచ్చారు.
కేసీఆర్ ఈ మాటలు చెబుతున్న వేళ.. ఇటలీ లో పరిస్థితి కాస్త చేయిదాటిపోతున్న పరిస్థితి. గడిచిన నాలుగు రోజుల్లో కరోనా వ్యవహారం ఎంత తీవ్రరూపం దాల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వేళ.. ఇప్పటివరకూ కరోనా మీద ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని సమీక్షించిన ముఖ్యమంత్రి.. భారీ ప్రాజెక్టును తెర మీదకు తీసుకొచ్చారు. పోలీసులు.. వైద్యాధికారులకు ఇచ్చిన ఈ టాస్కు హాట్ టాపిక్ గా మారింది. కరోనా విషయంలో తాను మొదట్లో చెప్పినట్లుగా పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందన్న కామెంట్లను వదిలేసి.. సీరియస్ గా కార్యరంగంలోకి దిగారని చెప్పక తప్పదు.
గడిచిన రెండు నెలల్లో వారు ఏమైనా ఆనారోగ్యానికి గురయ్యారా? ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు ఏమిటన్న విషయాల్ని రికార్డు చేయనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే..వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి.. కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే తెలంగాణ లో కరోనా ఫేజ్ టూలోకి ప్రవేశించిందన్న మాట వినిపిస్తున్న వేళ.. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా ఈ భారీ క్రతువును కేసీఆర్ సర్కార్ చేపట్టినట్లుగా చెబుతున్నారు. ఈ మహా జల్లెడ అనుకున్నది అనుకున్నట్లుగా సాగితే.. కరోనా వైరస్ ను విజయవంతంగా కట్టడి చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే ప్రజలంతా సాయంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమా.
కేసీఆర్ ఈ మాటలు చెబుతున్న వేళ.. ఇటలీ లో పరిస్థితి కాస్త చేయిదాటిపోతున్న పరిస్థితి. గడిచిన నాలుగు రోజుల్లో కరోనా వ్యవహారం ఎంత తీవ్రరూపం దాల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వేళ.. ఇప్పటివరకూ కరోనా మీద ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని సమీక్షించిన ముఖ్యమంత్రి.. భారీ ప్రాజెక్టును తెర మీదకు తీసుకొచ్చారు. పోలీసులు.. వైద్యాధికారులకు ఇచ్చిన ఈ టాస్కు హాట్ టాపిక్ గా మారింది. కరోనా విషయంలో తాను మొదట్లో చెప్పినట్లుగా పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందన్న కామెంట్లను వదిలేసి.. సీరియస్ గా కార్యరంగంలోకి దిగారని చెప్పక తప్పదు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా తలవంచాల్సిందేనన్న ఉక్కుసంకల్పాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ జల్లెడ కార్యక్రమాన్ని చేపట్టారు. సంక్రాంతి తర్వాత హైదరాబాద్ తో సహా తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన విదేశాల నుంచి వచ్చిన వారెంతమంది? వారి చిరునామాలు ఏమిటి? వారిప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎలాంటి ఆరోగ్య పరిస్థితిని కలిగి ఉన్నారు? లాంటి సమాచారాన్ని సేకరించనున్నారు.