Begin typing your search above and press return to search.
ఆ మాట వింటే పేకాటకు మించి కేసీఆర్ గుస్సా
By: Tupaki Desk | 23 July 2017 8:13 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొన్ని విషయాలు అస్సలు నచ్చవు. ఎందుకు? అని ఆయన్ను అడిగే పరిస్థితి ఉండదు. అందులోకి ఆయనకేమాత్రం నచ్చని విషయాల గురించి ప్రశ్నించే పరిస్థితి ఉండదు. ఒకవేళ అలా అడగాలన్న ఆలోచన ఎవరికైనా ఉన్నా.. ఆయన మీడియాకు అందుబాటులో ఉండరు. ప్రెస్ మీట్ పెట్టినా.. ఏ ఇష్యూ మీద పెట్టారో.. ఆ విషయం మీద తప్పించి.. డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వరు. కేసీఆర్ కు మొదట్నించి పేకాట అంటే మహా చిరాకు.
ఆయన దగ్గర పేకాట ముచ్చట తీసుకొచ్చే ధైర్యమే ఎవరూ చేయరు. ఒక్కసారి ఆ విషయం గురించి వచ్చిందంటే చాలు.. ఆయన తీవ్ర ఆగ్రహానికి గురి అవుతుంటారు. పేకాటను హైదరాబాద్ నుంచి తరిమి వేసే విషయంలో కేసీఆర్ కమిట్ మెంట్ ను మెచ్చుకోవాలి. అపార్ట్ మెంట్లలో ఫ్లాట్లు తీసుకొని మరీ పేకాట పెట్టే వారికి చుక్కలు చూపించి క్రెడిట్ కేసీఆర్ కే చెల్లుతుంది.
పేకాట రాయుళ్లు హైదరాబాద్ నుంచి బిషాణా ఎత్తేసే వైనంలో ఆయన పాత్రను తప్పనిసరిగా చెప్పక తప్పదు. పేకాట మీద పెద్ద యుద్ధమే చేసిన కేసీఆర్.. ఇప్పుడు తన ఫోకస్ అంతా డ్రగ్స్ మీద పెట్టినట్లుగా చెబుతున్నారు. డ్రగ్స్ ఎంతగా విస్తరించిందన్న విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహంతోనూ.. ఆవేదనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ విషయంలో ఎవరి ఒత్తిడిని పట్టించుకోవద్దని.. ఈ ముచ్చట లెక్క తీసే వరకూ వెనక్కి తగ్గొద్దని సీనియర్ అధికారులతో చెప్పినట్లుగా తెలుస్తోంది.
అంతేకాదు.. పార్టీ సీనియర్ నేతలకు సైతం..డ్రగ్స్ విచారణ విషయంలో అస్సలు కలుగజేసుకోవద్దని స్పష్టం చేసినట్లుగా సమాచారం. పేకాట నిర్మూలన విషయంలో కేసీఆర్ ఎంత పట్టుదలతో ఉన్నారో.. డ్రగ్స్ విషయంలోనూ అంతే పట్టుదలగా ఉండటమే కాదు.. దాని అంతు చూడాలన్న మాటను చెప్పినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే.. డ్రగ్స్ విచారణలో అధికారులు మరింత దూకుడును ప్రదర్శిస్తున్నట్లుగా చెప్పక తప్పదు.