Begin typing your search above and press return to search.
మాట జారిన విధేయుడికి క్లాస్ పీకారా?
By: Tupaki Desk | 3 May 2019 6:40 AM GMTతెలంగాణ ఉద్యమ బ్యాక్ గ్రౌండ్ తో చాలామంది నేతలు అయ్యారు. కానీ.. వారెవరూ మాజీ ఎంపీ.. తాజాగా ఎమ్మెల్యే అయిన బాల్క సుమన్ అంత అదృష్టవంతులు కారని చెప్పాలి. ఉద్యమ పురిటిగడ్డగా చెప్పుకునే ఓయూ ఆర్ట్స్ కాలేజీని కార్యక్షేత్రంగా చేసుకొన్న బాల్క సుమన్.. ఈ రోజున కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎంత నమ్మిన బంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఎంపీగా ఎన్నికయ్యాక కవితక్క వెంట ఉంటూ.. ఆమెకు వీర విధేయుడిగా వ్యవహరిస్తూ పెద్ద సారు మనసు దోచేసుకున్న పరిస్థితి. ఎంపీగా కాదు కానీ.. ఈసారి స్టేట్ కు వచ్చేయ్ అన్న మాటను పెద్దాయన చేత అనిపించుకొని ఆ మధ్యన జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి.
అన్ని బాగుంటే.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. బాల్క సుమన్ మంత్రి కావటం ఖాయమన్న మాట టీఆర్ఎస్ నేతల నోటి వెంట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి బాల్క సుమన్.. కేసీఆర్ ను కానీ.. ఆయన ఫ్యామిలీ మెంబర్లను ఉద్దేశించి ఎవరైనా అనుచిత వ్యాఖ్య చేసినా..సీరియస్ కామెంట్ చేసినా అస్సలు తట్టుకోలేరు. మాటకు రెండు మాటలు.. తిట్టుకు మూడు తిట్లు అన్నట్లుగా చెలరేగిపోతారు. తనకు రాజకీయ భిక్షను ప్రసాదించిన కల్వకుంట్ల ఫ్యామిలీకి వీర విధేయుడిలా బాల్క సుమన్ వ్యవహరిస్తుంటారు. నిజానికి ఇదేం తప్పు కాదు. రాజకీయంగా తనను పైకి తెచ్చిన వారిని అభిమానించటం.. ఆరాధించటం.. అవసరమైతే వారి కోసం పోరాడటం లాంటవి మామూలే.
అయితే.. ముందువెనుకా చూసుకొని చేయాల్సిన ఈ పనుల్ని.. బాల్క సుమన్ అందుకు భిన్నంగా తనకు తోచినట్లు చేసేస్తుంటారు. తాజాగా ఇంటర్ ఫలితాల నేపథ్యంలో కేటీఆర్ ను టార్గెట్ చేసిన విపక్ష నేతల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో ఘాటు మోతాదు మించిందన్న వాదన ఉంది. తమ చినబాస్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాల్క సుమన్ చెలరేగిపోయారు.
దీనికి బదులుగా రేవంత్ మరింతగా మండిపడ్డారు. సుమన్ పేరు ప్రస్తావించకుండానే.. దారుణమైన కామెంట్ చేశారు. ఇలాంటివేళ.. సుమన్ వెంటనే రియాక్ట్ అవుతుంటారు.ఈ నేపథ్యంలో రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు ఖాయమన్న మాట వినిపించింది. అనూహ్యంగా సుమన్ మాత్రం మౌనాన్ని ఆశ్రయించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేటీఆర్ ను వెనకేసుకొచ్చిన బాల్క సుమన్ విరుచుకుపడిన వైనాన్ని బిగ్ బాస్ మందలించినట్లుగా తెలుస్తోంది. అన్ని సందర్భాల్లో నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని.. లక్షలాది పిల్లల విషయంలో అజాగ్రత్తగా ఉంటే జరిగే డ్యామేజ్ భారీగా ఉండొచ్చంటున్నారు. ఈ కారణంతోనే వివాదాన్ని మరింత పెంచేందుకుఅవకాశం ఉన్న మాటల్ని కట్టిపెట్టి.. మౌనంగా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే మొదట్లో తన మాటలతో మంట మండించిన బాల్క సుమన్.. తర్వాతి కాలంలో గమ్మున ఉండిపోవటానికి ఇదే కారణంగా చెబుతన్నారు. మరి.. ఇందులో నిజమెంతన్నది కాలమే డిసైడ్ చేయాలి.