Begin typing your search above and press return to search.
కేసీఆర్ నోట మూడో సర్వే రిజల్ట్స్ మాట!
By: Tupaki Desk | 23 March 2018 5:47 AM GMTఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అన్న విషయాన్ని వివిధ రూపాల్లో క్రాస్ చెక్ చేసుకోవటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. తమకు తిరుగులేని బలం ఉందన్న విషయం మీద అవగాహన ఉన్నా.. ఆ విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయా? అన్న విషయాన్ని గుర్తించేందుకు వీలుగా తరచూ సర్వేలు నిర్వహిస్తుంటారు.
అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ఆయన నిర్వహించే సర్వేలు ఉంటాయి. తాను చేయించిన సర్వే వివరాల్ని తన మూడ్ కు తగ్గట్లు ప్రకటించే కేసీఆర్.. తాజాగా తాను చేయించిన మూడో సర్వే ఫలితాల్ని పార్టీ నేతలతో పంచుకున్నారు. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముందు రోజు.. ఓట్లు ఎలా వేయాలన్న అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నేతలతో మాట్లాడుతూ.. తాను మూడో సర్వే చేయించానని.. ఇందుకు సంబంధించిన రిజల్ట్ వచ్చినట్లు చెప్పారు.
సర్వే విషయాలు చూస్తే.. ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉందన్న విషయాన్ని వెల్లడించారు . సర్వేలో ప్రభుత్వం.. పార్టీ ఎమ్మెల్యేల పరితీరు విషయంలోనూ మెరుగు పడిందన్న మాట వచ్చిందన్నారు. గతంతో పోలిస్తే ఎమ్మెల్యేలకు ప్రజామోదం పెరిగిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. ఆ క్రెడిట్ ఎమ్మెల్యేల కన్నా.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పారు. మొత్తానికి ఎమ్మెల్యేలకు సంతోషాన్ని ఇస్తూనే.. దాని వెనుక తన పాత్రను కేసీఆర్ గుర్తు చేయటం గమనార్హం.