Begin typing your search above and press return to search.

కొత్తింట్లో కేసీఆర్ సంతకం చేసిన మొదటి ఫైల్ ఇదే

By:  Tupaki Desk   |   25 Nov 2016 5:52 AM GMT
కొత్తింట్లో కేసీఆర్ సంతకం చేసిన మొదటి ఫైల్ ఇదే
X
తనకున్న వాస్తు నమ్మకాలకు తగ్గట్లే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త అధికారిక నివాసాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. తొమ్మిది నెలల వ్యవధిలో.. వాయు వేగంతో తాను కోరుకున్నచందంగావిశాలపమైన భవన సముదాయాల్ని నిర్మించిన ఆయన.. గృహప్రవేశ కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించారు. తాను ఉండనున్న అధికారిక నివాసానికి ‘‘జనహిత’’ అని పేరు పెట్టుకున్న ఆయన.. ఇక ప్రజలతో ముఖాముఖి ఏర్పాటుతో పాటు.. వివిధ ప్రాంతాల ప్రజల్ని ప్రభుత్వ ఖర్చులతో రప్పించి మరీ మాట్లాడతామని.. వారి సమస్యలు తెలుసుకుంటామని చెప్పారు.

అంతేకాదు.. ఇకపై అన్నీ ప్రభుత్వ కార్యక్రమాలు కొత్త ఇంట్లోనే జరుగుతాయన్న విషయాన్ని ఆయన తేల్చేశారు. కవి సమ్మేళనాలు.. ఉగాది పంచాంగ శ్రవణాలు.. ఇఫ్తార్ విందులు.. క్రిస్మస్ డిన్నర్లు మాత్రమే కాదు.. అధికారుల సమీక్షా సమావేశాల్ని కూడా అధికారిక నివాసం నుంచే నిర్వహిస్తామని తేల్చేశారు.ఇకపై పలు వేదికల చుట్టూ తిరగటం.. హోటళ్లకు వెళ్లటం లాంటివి ఉండవని.. అన్నీ అధికారిక నివాసం నుంచే జరుగుతాయని తేల్చారు.

కొత్తింట్లోకి అడుగుపెట్టిన వేళ.. కేసీఆర్ తొలి ఫైలును చూసి సంతకం చేశారు. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో ఎస్సీ.. బీసీ విద్యార్థుల మాదిరే ఎస్టీ విద్యార్థులు సైతం నెలవారీగా నిర్వహణ ఖర్చు చెల్లించాలన్న ఫైలుపై సంతకం చేశారు. కేసీఆర్ చేసిన తాజా సంతకంతో రాష్ట్రంలోని 101ఎస్టీహాస్టళ్లలోని 14,685మంది విద్యార్థులు లబ్థి పొందనున్నారు. ఇప్పటివరకూ ఈ విద్యార్థులకు ఆరు నెలలకోసారి మాత్రమే నిధులు విడుదల ఉండేది. దీంతో.. వారు తీవ్ర ఇబ్బందికి గురయ్యే వారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రతినెలాఎస్టీ విద్యార్థికి రూ.1050 నుంచి రూ.1200 వరకూ నిర్వహణ ఖర్చు కింద అందనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/