Begin typing your search above and press return to search.
అదేంది సారూ.. రూ.760 కోట్లు ఏం చేశారు?
By: Tupaki Desk | 9 Nov 2019 6:57 AM GMTతెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఐదు వారాలు దాటి.. ఆరో వారం లోకి అడుగు పెట్టింది. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే సిద్దమని కార్మికులు స్పష్టం చేస్తున్నా.. భేషరతుగా ఉద్యోగాల్లోకి చేరాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మూడు రోజుల గడువు పూర్తి అయ్యింది. ఇప్పటి కి మూడు సార్లు వార్నింగ్ ఇచ్చినా.. ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. సీఎం కేసీఆర్ పిలుపునిస్తే స్పందన ఇంత తక్కువగా ఉంటుందా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది.
తన మాటను వినని ఆర్టీసీ కార్మికులకు షాకిచ్చేందుకు వీలుగా పావులు కదుపుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి.. ప్రభుత్వాని కి కోర్టు నుంచి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇదిలా ఉంటే.. మరో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. తరచూ నీతులు చెప్పే కేసీఆర్.. ఆర్టీసీ ఉద్యోగుల కు సంబంధించిన దారుణమైన మోసం జరిగిన వైనం వెలుగు చూసింది.
సాధారణం గా ఏదైనా ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ.. సదరు ఉద్యోగి కి జీతం తో పాటు.. అతనికి యాజమాన్య వాటా కింద ఉద్యోగ భవిష్యనిధి ని పీఎఫ్ ఖాతా లో జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ.. ఉద్యోగుల ఖాతా లో జమ చేయాల్సిన మొత్తం జమ చేయకుంటే వారి పై చర్యలు తీసుకోవటమే కాదు..కేసులు నమోదు చేస్తారు. విచిత్ర మైన అంశం ఏమంటే.. గడిచిన కొన్నేళ్లుగా ఆర్టీసీ ఉద్యోగుల కు చెల్లించాల్సిన పీఎఫ్ మొత్తాన్ని తెలంగాణ ఆర్టీసీ చెల్లించటం లేదన్న విషయాన్ని గుర్తించారు.
గడిచిన కొన్నేళ్లు గా ఈపీఎఫ్ నిధుల్ని సంస్థ అవసరాల కోసం మళ్లించటం.. సకాలంలో ఉద్యోగి ఖాతాలో పీఎఫ్ చెల్లించ కుండా డిపాల్ట్ కావటం ఆనవాయితీగా మారింది. ఈ మొత్తం అంతకంత కూ పెరిగి.. ఇప్పుడు ఏకంగా రూ.760 కోట్ల భారీ మొత్తంగా మారింది. సాధారణంగా ఇదే పని ఏదైనా ప్రైవేటు సంస్థ చేసి ఉంటే.. మోసం కేసు పెట్టి లోపలేసేవాళ్లు.
మరి.. వేలాది కార్మికుల కు చెందిన ఈ భారీ మొత్తాన్ని వారి ఖాతాల్లో కి చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని ఏమనాలి ? అందుకు కారణం ఏమిటి? తరచూ కార్మికుల తప్పుల్ని ఎత్తి చూపే ప్రభుత్వం.. ప్రభుత్వాధి నేత.. మరీ రూ.760 కోట్ల విషయం లో ఏమని బదులిస్తారు? పిల్లల డబ్బుల్ని దాస్తానని చెప్పి.. వారికి తెలీకుండా దాచేస్తే ఆ తండ్రిని ఏమంటారు? ఇప్పుడు అలాంటి కండీషన్లో నే ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఈ రూ.760 కోట్లకు ఏమని బదులిస్తారు ?