Begin typing your search above and press return to search.
భద్రాద్రి రాములోరి కల్యాణానికి ఈసారి వెళ్లని కేసీఆర్
By: Tupaki Desk | 14 April 2019 10:40 AM GMTఉమ్మడి ఏపీలో శ్రీరామనవమి వచ్చిందంటే చాలు.. ఆ హడావుడి వేరుగా ఉండేది. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రామాలయంలో జరిగే కల్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాల్ని తీసుకొచ్చేవారు. ఆ కార్యక్రమానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.
ఏమైందో ఏమో కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత భద్రాచలంలో జరిగే రాములోరి కల్యాణానికి సీఎంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ స్వయంగా ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లటం కనిపించదు. దేవుడంటే భక్తి.. పూజలు.. పునస్కారాలు ఎక్కువగా చేయిస్తూ.. యాగాలు చేయించే సీఎం కేసీఆర్ భద్రాచలంకు ముత్యాలు ఎందుకు తీసుకెళ్లరన్నది ప్రశ్నగా కనిపిస్తూ ఉంటుంది.
ఈసారి కూడా సీఎం కేసీఆర్ భద్రాచలం రాములోరి కల్యాణానికి వెళ్లలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు.. స్వామివారికి.. అమ్మవారికి సమర్పించారు. భద్రాచలం రాములోరి పెళ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లటం.. పట్టు వస్త్రాలు సమర్పించటం మినహా మిగిలినవన్నీ ఎప్పటిలానే జరుగుతున్నాయి. వేలాదిసంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకోవటం.. చలువ పందిళ్ల కింద స్వామివారి కల్యాణాన్ని వీక్షించటం లాంటివి జరిగిపోయాయి. అన్ని ఎప్పటిలానే జరిగినా.. సీఎం స్థానంలో ఉన్న నేత కల్యాణానికి హాజరుకాకపోవటం మాత్రం ఒకింత లోటుగా కనిపించిందని చెప్పక తప్పదు.