Begin typing your search above and press return to search.

మ‌హిళ‌పై ప్ర‌తాపం చూప‌ట‌మా కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   6 Oct 2018 8:08 AM GMT
మ‌హిళ‌పై ప్ర‌తాపం చూప‌ట‌మా కేసీఆర్‌?
X
ఎన్నాళ్లాకు ఎన్నాళ్ల‌కు.. ఈ పుర‌షాంహ‌కార స‌మాజంలో ఒక మ‌హిళ ధైర్యం చేసి.. కాళిలా విరుచుకుప‌డ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. కేసీఆర్ లాంటి అధినేత‌ను నాలుగు మాట‌లు అనేందుకు మ‌గ‌మ‌హారాజులు అనేటోళ్లు సైతం ఆలోచించి మాట్లాడే ప‌రిస్థితుల్లో.. అందుకు భిన్నంగా.. కాస్కోండి కొడ‌క‌ల్లారా? అన్న మాట అన‌టం అంటే మాట‌లా? అది డీకే అరుణ‌కు మాత్ర‌మే చెల్లుతుంది.

త‌న‌కు తానుగా మాట తూల‌టం డీకే అరుణకు అల‌వాటు ఉండ‌దు. కానీ.. ఎవ‌రైనా త‌న‌ను కానీ.. త‌న పార్టీని కానీ మాట్లాడ‌టం మొద‌లు పెడితే మాత్రం ఆమెను ఆప‌టం ఎవ‌రి త‌రం కాదు. ఇప్పుడీ విష‌యం తెలంగాణ స‌మాజానికి మాత్ర‌మే కాదు.. మొన‌గాడు సీఎంగా గొప్ప‌లు చెప్పుకునే కేసీఆర్ కు సైతం అర్థ‌మైంది.

తన పైత్య‌పు మాట‌ల‌తో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా నోరు పారేసుకునే కేసీఆర్ కు క‌ర్రె కాల్చి వాత పెట్టే చందంగా.. డీకే అరుణ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు..కేసీఆర్ లాంటి ట‌వ‌రింగ్ ప‌ర్స‌నాలిటీలోనూ పుర‌షాహంకారం పురులు విప్పి నాట్య‌మాడే ప‌రిస్థితి. ఒక మ‌హిళ‌.. త‌న‌ను.. త‌న పార్టీ నేత‌ల్ని అంతేసి మాట‌లు అనుడా? తాను అనుకుంటే.. ఏ మ‌హిళ‌కు మంత్రివ‌ర్గంలో అవకాశం లేకుండా చేసిన త‌న లాంటి వాడినే.. అంత మాట అనుడా? అన్న ఫీలింగ్ కేసీఆర్ లో ఎక్కువైంద‌న్న విష‌యం తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి.

ఇటీవ‌ల రోడ్ షోలో.. త‌మ పార్టీని ఉద్దేశించి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్యాఖ్య‌లు చేస్తున్న కేసీఆర్‌ను ఉద్దేశించి డీకే అరుణ మాట్లాడుతూ.. కాస్కోండి కొడ‌క‌ల్లారా.. మీ సంగ‌తి చూస్తానంటూ ఆమె వీరావేశంతో అన్న మాట‌ల‌కు గులాబీ అధినేత‌తో పాటు.. గులాబీ క్యాంప్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ఇప్ప‌టివ‌ర‌కూ త‌మ‌ను ఒక మాట అనాలంటే ఏమ‌వుందోన‌న్న భ‌యం క‌లిగేలా చేసిన త‌మ ప‌వ‌ర్ ను త‌న ఎడ‌మ కాలితో లాగి పెట్టి ఒక్క త‌న్ను త‌న్నిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన డీకే అరుణ వ్యాఖ్య‌లు కేసీఆర్ ను ఎంత‌గా సూటిగా.. లోతుగా సాగాయో ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన తాజా వ్యాఖ్య‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.

కాస్కోండి నా కొడ‌క‌ల్లారా అంటూ డీకే అరుణ చేసిన వ్యాఖ్య‌ల్ని ప్ర‌స్తావిస్తూ కేసీఆర్‌.. డీకే అరుణా.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో.. నీ బండారం ఏందో.. నీ చ‌రిత్ర ఏందో బ‌య‌ట‌పెడ‌తామంటూ కేసీఆర్ నిప్పులు చెరిగిన తీరు చూస్తే.. కేసీఆర్ లాంటి పెద్ద‌మ‌నిషి.. ఒక మ‌హిళా నేత‌ను ఉద్దేశించి మ‌రీ అంత కుర‌చ‌గా వ్యాఖ్య‌లు చేయ‌టం ఏమిట‌నిపించ‌క మానదు. అయినా.. ఒక మ‌హిళా నేత మీద మ‌రీ అంతలేసి మాట‌లేంది సారూ?