Begin typing your search above and press return to search.
కారులో నిఘా బ్రేకులు
By: Tupaki Desk | 21 Sep 2018 4:33 AM GMTకల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఇది కాకుండా ఆయనలో మరో కోణం ఉంది. అది చాలా మందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావును తన శిష్యుడని చెప్పుకుంటారు కాని... రాజకీయాలు నెరపడంలో ఆయన్ని మించిపోతారు చంద్రశేఖర రావు. దీనికి తార్కాణమే తాజా రాజకీయ ఎత్తుగడ. ఇంతకీ ఈ ఎత్తుగడ ప్రత్యర్ధుల మీద అనుకుంటున్నారా.... కాదు కాదు...తన వారి మీదే. అదేమిటంటే.... ముందస్తు ఎన్నికలు ప్రకటించడం... ఏకంగా 105 మంది అభ్యర్ధులను ప్రకటించడం వరకూ సంచలనమే చేశారు కల్వకుంట్ల వారు. ఇంతటితో ఆగకుండా టిక్కట్లు ఇచ్చిన అభ్యర్ధులపై నిఘా నేత్రాలను కూడా సంధించారట ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఒకేసారి 105 మంది అభ్యర్ధులను ప్రకటించి ప్రతిపక్షాల్లో గుబులు రేపిన ఆయన ఇప్పుడు తన అభ్యర్ధుల్లోనే ఆ గుబులు పెంచుతున్నారు.
ప్రతి నియోజకవర్గంలోనూ తాను ప్రకటించిన అభ్యర్ధుల ప్రచారం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఓ నిఘా వ్యవస్ధనే ఏర్పాటు చేశారట కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రచార సరళి... అభ్యర్ధులపై ప్రజల్లో వస్తున్న అభిప్రాయాలు.... వీటిన్నటిని పరిగణలోకి తీసుకుని వారికి దిశానిర్దేశం చేస్తారట. ఇందుకోసం ప్రగతి భవన్‌లో ఏకంగా ఓ వ్యవస్ధనే ఏర్పాటు చేశారని సమాచారం. ప్రచారం సరిగా నిర్వహించని వారిని - ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న వారిని ముందుగా హెచ్చరించాలని - అయినా విని దారికి రాకపోతే వారి స్ధానంలో మరొకరికి టిక్కట్లు ఇవ్వాలన్నది కల్వకుంట్ల వారి ఆలోచనగా చెబుతున్నారు. ఇందుకోసం ఏర్పాటు వ్యవస్ధ ప్రతి నియోజకవర్గం నుంచి మూడు రోజులకొకసారి నివేదిక ఇస్తుందని - ఆ నివేదిక ఆధారంగా సంబంధిత జిల్లాకు చెందిన మంత్రులు - సీనియర్ నాయకులు అభ్చర్ధులకు దిశానిర్దేశం చేస్తారన్నది పార్టీ నుంచి వచ్చిన సమాచారం. ఇందులో కల్వకుంట్ల చంద్రశేఖర రావు మార్కు రాజకీయం కూడా ఉందంటున్నారు. అదేమింటే సిట్టింగుల్లో కొందరి పట్ల ముఖ్యమంత్రికి సదభిప్రాయం లేదట. వారిని మార్చాలని అనుకున్నారట. అయితే ఎన్నికల ముందు మారిస్తే వారంతా ఇతర పార్టీలలో చేరతారనే భయంతో ముందు టిక్కట్లు ప్రకటించి వారిని రాజకీయ బందీలుగా చేశారని అంటున్నారు. ఇప్పుడు నిఘా నివేదికల ఆధారంగా వారిని మార్చి కొత్త వారికి టిక్కట్లు ఇవ్వడం కూడా ఇందులో ఓ రాజకీయ వ్యూహమే అని అంటున్నారు. అంటే ఒక దెబ్బకు 105 పిట్టలు. కాదు...కాదు.... ఒక దెబ్బకు వంద పిట్టలు. మిగతా ఐదుగురు తాను - తన కుమారుడు - తన మేనల్లుడు.... తన సన్నిహిత మంత్రులు. ఇదీ కల్వకుంట్ల వారి రాజకీయం. ఎవ్వరైనా శభాష్ అనకుండా ఉండగలరా....!?