Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి వేదిక‌పై కేసీఆర్ స్పీచ్

By:  Tupaki Desk   |   22 Oct 2015 1:21 PM IST
అమ‌రావ‌తి వేదిక‌పై కేసీఆర్ స్పీచ్
X
న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న వేదిక‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌సంగం చాలా హైలెట్ అయ్యింది. స‌భావేదిక‌పై కూర్చున్న కేసీఆర్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ర్షించారు. ఆయ‌న‌కు చంద్ర‌బాబు పుష్ప‌గుచ్ఛం ఇచ్చి స్వాగ‌తం ప‌లికేట‌ప్పుడు అంద‌రూ ఈ ఇద్ద‌రు చంద్రుల‌ను చాలా ఆస‌క్తిగా గ‌మ‌నించారు. కేసీఆర్ చేతులు ఊపుతూ ప్ర‌జ‌ల‌కు అభివాదం తెలిపారు. ఇద్ద‌రు నేత‌లు ప‌ర‌స్ప‌రం చిరున‌వ్వుల‌తో ప‌ల‌క‌రించుకున్నారు.

అనంత‌రం కేసీఆర్ మూడు నిమిషాల త‌న ప్ర‌సంగంలో ముందుగా గౌర‌వ‌నీయులు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోడీగారు, ఏపీ సీఎం శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు గారు, అశోక్‌ గ‌జ‌ప‌తిరాజు గారు, నిర్మాలా సీతారామ‌న్ గారు - సుజ‌నాచౌద‌రి గారు - జ‌పాన్ - సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌తో పాటు గ‌వ‌ర్న‌ర్లు న‌ర‌సింహ‌న్‌ - రోశ‌య్య పేర్ల‌ను ప్ర‌స్తావించారు. ప‌విత్ర‌మైన విజ‌య‌ద‌శ‌మి రోజున ప్ర‌ధాన‌మంత్రి చేత ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి శంకుస్థాప‌న జ‌ర‌గ‌డం ఆనంద‌క‌ర‌మైన విష‌యం అని చెప్పారు. అమ‌రావ‌తి ప్ర‌పంచంలోనే ఒక అద్భుత‌మైన న‌గ‌రంగా చ‌రిత్ర‌కెక్కాల‌ని తాను ఆకాంక్షిస్తున్న‌ట్టు కేసీఆర్ చెప్పారు.

అలాగే అమ‌రావ‌తి నిర్మాణం కోసం తెలంగాణ త‌ర‌పున తాము అన్ని విధాలా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం ద్వారా ఆయ‌న తెలివిగా ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను కూడా గెలుచుకున్నారు. విశేషం ఏంటంటే కేసీఆర్ ప్ర‌సంగించేందుకు స్టేజ్‌ మీద లేవ‌గానే ఒక్క‌సారిగా ఈల‌లు, కేక‌లు పెద్దఎత్తున వినిపించాయి. ఏదేమైనా కేసీఆర్ అమ‌రావ‌తి శంకుస్థాప‌న వేదిక‌గా చేసిన ప్ర‌సంగం బాగా హైలెట్ అయ్యింది.