Begin typing your search above and press return to search.

ఖడ్గచాలనం కాదు..కరచాలనం: కేసీఆర్

By:  Tupaki Desk   |   30 May 2019 8:01 AM GMT
ఖడ్గచాలనం కాదు..కరచాలనం: కేసీఆర్
X
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ చేత ‘వైఎస్ జగన్ అనే నేను’ అని ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్ ను పంపించారు. అనంతరం సభలో తొలుత స్టాలిన్ క్లుప్తంగా మాట్లాడి జగన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక కేసీఆర్ పలు సూచనలను జగన్ కు చేశారు..

కేసీఆర్ మాట్లాడుతూ తెలుగు వారు కలిసి ఉంటే కలదు సుఖమని.. గోదావరి, కృష్ణా నీళ్లను వాడుకొని రెండు రాష్ట్రాలు సౌభాగ్యంగా ఉండాలని కోరారు. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన జగన్.. పెద్ద బాధ్యతను సమర్థంగా నిర్వహించాలని కోరారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలపించేలా పాలన కొనసాగించాలని.. ఆయన వారసత్వాన్ని నిలబెట్టాలని ఆశీర్వదించారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సమస్యలున్నాయని వాటిని బాధ్యతతో కలిసి ఉండి నెరవేర్చుకుందామని కేసీఆర్ అన్నారు. కృష్ణ నదీ జలాల వినియోగంలో కొన్ని సమస్యలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. గోదావరి జలాలను రెండు రాష్ట్రాల్లో ప్రతీ అంగుళానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్క టర్మ్ కాదు.. నాలుగైదు టర్మ్ లు రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి గా జగన్ వయసు చిన్నది అని.. బాధ్యత పెద్దది అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బాధ్యతను నెరవేర్చే శక్తి ఉందని నిరూపించుకున్నారని కేసీఆర్ చెప్పారు. తండ్రి వైఎస్ శక్తి సామార్థ్యాలు జగన్ కు సంక్రమించాలని కేసీఆర్ కోరుకున్నారు. రెండు రాష్ట్రాలు ఖడ్డచాలనం చేయద్దని.. కరచాలనం చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పోరు కాదు.. ప్రేమ అని స్పష్టం చేశారు.