Begin typing your search above and press return to search.
కేసీఆర్ నోట ఎన్ని పంచ్ లంటే..? 1
By: Tupaki Desk | 31 Jan 2016 6:16 AM GMTహైదరాబాద్ రోడ్లు తన కారణంగా ట్రాఫిక్ జాం కాకూడదన్న ఉద్దేశంతో గ్రేటర్ ప్రచారానికి దూరంగా ఉన్నానని చెప్పుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తాను రోడ్డు మీదకు వచ్చి ప్రచారం చేస్తే ట్రాఫిక్ మస్తుగా జామ్ అయిపోయి.. ప్రజలు ఇబ్బంది పడకూడదన్న భావనతో గల్లీల్లో ప్రచారానికి దూరంగా ఉన్న కేసీఆర్.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. గల్లీ.. గల్లీ తిరిగి.. అందరితో మాట్లాడేకన్నా.. అరగంట వ్యవధిలో తాను అనుకున్న విషయాన్ని హైదరాబాద్ ప్రజల మనసులతో పాటు.. తెలంగాణ సమాజం మొత్తానికి చేరేలా ప్లాన్ చేసిన ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు.
బహిరంగ సభకు రెండు రోజుల ముందు మీడియాతో సమావేశమైన సందర్భంగా కాంగ్రెస్ ను ఎక్కువగా.. తెలుగుదేశం విషయంలో కొద్దిపాటి విమర్శలు చేసిన కేసీఆర్.. బహిరంగ సభకు వచ్చే సరికి బాబును బండకేసి బాదినట్లుగా విమర్శలు చేసేశారు. చివరకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని సైతం తన మాటల్లోకి తీసుకొచ్చిన ఆయన వదినమ్మ అంటూనే ఆమె ఓటు తమకే వేస్తారని.. ఆ విషయాన్ని తమ కార్యకర్తకు ఆమె చెప్పినట్లుగా వెల్లడించిన అందరిని విస్మయానికి గురి చేశారు.
పరేడ్ గ్రౌండ్స్ లో అరగంట సేపు మాట్లాడిన కేసీఆర్ నోటి నుంచి పంచ్ లు ఓ రేంజ్ లో పడ్డాయి. చంద్రబాబు.. కాంగ్రెస్.. బీజేపీతో పాటు నారాయణను కూడా వదిలిపెట్టకుండా అందరిపై టోకుగా విరుచుకుపడ్డారు. అందరికంటే ఎక్కువగా బాబు మీద భారీగా మాటల తూటాలు పేల్చారు.
‘‘చంద్రబాబు నాయుడూ.. నువ్వో దోపిడీదారుడివి. కార్మికుల శ్రమను దోచుకున్నవ్. పెట్టుబడిదారుల కొమ్ము కాసినవ్. హైదరాబాద్ లో నా ముద్రలు ఉన్నవని గొప్పలు చెబుతున్నవ్. బషీర్ బాగ్ కాల్పులు జరిపి నలుగురిని పొట్టన పెట్టుకున్న రక్తపు ముద్రలు ఉన్నయ్. అసెంబ్లీ ముందు అంగన్ వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన ముద్రలు ఉన్నయ్. మూసీ మురికిలో నీ అడుగు ఉంది. కార్మికుల కడుపు కొట్టినవ్. దేశంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను సృష్టించిన ముద్రలు నీవే. మేం వారిని పర్మనెంట్ చేసి ముద్రలు వేస్తున్నం’’
‘‘అక్కడ ఆయనకు చేసుకోవడానికి కావాల్సినంత పని ఉంది. మీ పని మీరు చేసుకోండి. మా పని మేం చేసుకుంటం. హైదరాబాద్ బజార్లు మేమే ఊడ్చుకుంటం. చంద్రబాబు ఊడ్చుకోవాలంటే హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకా చాలా బజార్లు ఉన్నాయి. కానీ చంద్రబాబు వదల బొమ్మాళీ.. వదల అంటూ హైదరాబాద్ ను వదల అంటుండు. అయినా ఎవడు పొమ్మన్నడు? కావాలంటే మరో 25 హెరిటేజ్ దుకాణాలు పెట్టుకో. పర్మిషన్లు ఇప్పిస్తం. 15 రోజులకోసారి వచ్చిపో’’
‘‘మా వదిన భువనేశ్వరి దగ్గరకు మా కార్యకర్తలు వెళితే మీకే ఓటేస్తానని చెప్పింది. అది తెలియని చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నడు. అమరావతికి వచ్చి నేనక్కడే ఉంటానంటే అవుతుందా?’’
‘‘తెలంగాణ సాధనకు నేను అమరణ దీక్షకు కూర్చున్నా. పది పన్నెండు రోజులకు చావుకు సిద్ధంగా తయారయ్యా. గ్రామాలతో పాటు హైదరాబాద్ ప్రజలు పోరాటబాట పట్టిండ్రు. ప్రభుత్వ ఐకమత్యాన్ని చూసి యూపీఏ ప్రభుత్వం దిగి వచ్చింది. హైదారాబాద్ తో కూడిన తెలంగాణను ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత నాటకం మొదలైంది. నిన్న మొన్న ఇక్కడ తిరిగిన చంద్రబాబు కుట్రలు చేసి తెలంగాణను అడ్డుకున్నారు. తెలంగాణ వచ్చే సమయంలో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని.. మరొకటి చేయాలని కుట్రలు చేశాడు. ప్రజలు దానిని ఇంకా మర్చిపోలేదు. గట్టి పోరాటం చేసి హైదరాబాద్ సహా తెలంగాణ తెచ్చుకున్నాం’’