Begin typing your search above and press return to search.
నువ్వు ఒకటంటే.. నేను పదంటా!
By: Tupaki Desk | 13 March 2016 11:28 AM GMTఅధినేతలకు వ్యూహాలు మామూలే. దూకుడు రాజకీయాల్లో వ్యూహం లేకుండా ఉండటం సాధ్యమే కాదు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. గవర్నర్ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో విపక్షాలు చేసే వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ కేసీఆర్.. అసెంబ్లీలో ఉగ్రరూపం దాల్చారు.
ప్రాజెక్టుల విషయంలోనూ.. మహారాష్ట్ర సర్కారుతో తాజాగా చేసుకున్న ఒప్పందంపైనా ఆయన వివరించే ప్రయత్నంతో పాటు.. నలభై సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై నిప్పులు కురిపించారు. మీ చరిత్ర చాలానే చెప్పాలంటూ మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సాగునీటి ప్రాజెక్టులు.. అందులో భాగంగా చోటు చేసుకున్న తప్పుల్ని ఒక్కొక్కటి చొప్పున వివరిస్తూ ఘాటైన విమర్శలు చేశారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తెలిపే క్రమంలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఒక్కొక్కటిగా వేలెత్తి చూపిన ఆయన.. పలు సందర్భాల్లో మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చెప్పాల్సిన చరిత్ర ఎంతో ఉందంటూ మండిపడ్డారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి.. జీవన్ రెడ్డి.. చిన్నారెడ్డిల మీద గుస్సా అయిన కేసీఆర్ తీరు చూసినప్పుడు ఒక్క మాట స్పష్టంగా అర్థమవుతుంది. మీరు నన్ను ఒక్కమాట అంటే నేను మిమ్మల్ని పది మాటలు అంటా. అది కూడా విత్ ఫ్రూప్స్ తో అన్నట్లుగా కేసీఆర్ వైఖరి ఉండటం గమనార్హం. ప్రాజెక్టుల మీద కేసీఆర్ కమాండ్ కు కాంగ్రెస్ సభ్యుల నోట మాట రాని పరిస్థితి. ఏమైనా విషయాల మీద పట్టు పెంచుకుంటే ఇలానే ఉంటుంది మరి.