Begin typing your search above and press return to search.

కేసీఆర్ పంచాగం లో ముప్పుతేలిన నేత ఎవ‌రు?

By:  Tupaki Desk   |   29 March 2017 4:53 PM GMT
కేసీఆర్ పంచాగం లో ముప్పుతేలిన నేత ఎవ‌రు?
X
తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కార్యాల‌యం, ఆయా పార్టీల‌ కార్యాల‌యాల్లో పంచాగ శ్ర‌వ‌ణం నిర్వ‌హించ‌డం ఏళ్లుగా వ‌స్తున్న ఆన‌వాయితి. ఈ ఏడాది సైతం ఇటు సీఎం కొత్త కార్యాల‌య‌మైన ప్ర‌గ‌తి భ‌వ‌న్‌, వివిధ పార్టీ ఆఫీసుల్లో జ్యోతిష్యులు భ‌విష్య‌వాణి వినిపించారు. ఇందులో అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రగతిభవన్‌లో పంచాంగకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఒక నాయకుడికి కూడా ప్రమాదం పొంచి ఉందని హెచ్చ‌రించారు. అంతేకాదు తెలంగాణలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఈ జ్యోతిష్యం ఇటు అధికార టీఆర్ ఎస్ పార్టీలో, అటు అధికార ప‌క్షంలో క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది.

కాగా, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని సంతోష్‌ కుమార్ శాస్త్రి చెప్పారు. పంటలు సమృద్ధిగా పండటంతో ధరలు నియంత్రణలో ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అద్భుతంగా విజయవంతమవుతాయని చెప్పారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఈ ఏడాది అద్భుతంగా ఉంటుందని పంచాంగం చెప్తుండటం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పడం శుభసూచకమన్నారు. శాస్త్రవేత్తలు కూడా మంచి వర్షాలు ఉంటాయని చెప్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. అధికారులు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారని, దేశంలోనే అత్యధిక వృద్ధిరేటుతో ముందుకుపోతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. శాంతిభద్రతల విషయంలో దేశానికే తలమానికంగా ఉన్నామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/