Begin typing your search above and press return to search.
ఇంత డబ్బు కష్టం ఉంటే ధనిక రాష్ట్రమేంది కేసీఆర్
By: Tupaki Desk | 1 Oct 2015 4:17 AM GMT‘‘అవును.. మాది ధనిక రాష్ట్రమే’’ అంటూ వివిధ వేదికల పైనుంచి సగర్వంగా ప్రకటించుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సర్కారు ఆర్థిక పరిస్థితి గురించి లెక్కలు చెప్పుకొచ్చారు. కష్టాల కడలిలో.. అప్పుల వెతలో అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలు చేసుకోవద్దని.. తెలంగాణ తెచ్చుకుంది ఆత్మహత్యల కోసం కాదని చెప్పారు.
మరి.. ఆ మాట చెప్పిన ఆయన.. వారికి సాంత్వన కలిగేలా.. ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీకి తగ్గట్లు ఏదైనా వరం ప్రసాదించారా? అంటే లేదనే చెప్పాలి. కాకుంటే.. వాస్తవాల్ని వివరించే ప్రయత్నం చేశారు. దివంగత నేత వైఎస్ మాదిరి ఒకే దెబ్బకు మొత్తం రుణాల్ని మాఫీ చేయొచ్చుగా అంటూ మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ గుర్తు చేయటమో.. రుణమాఫీని విడతల వారీగా విడుదల చేయటంతో.. ఆ వచ్చిన మొత్తం వడ్డీలకే సరిపోవటం ఇబ్బందికరంగా మారిందన్న విపక్షాల సూచన ఆయనపై ప్రభావం పడిందో కానీ.. రైతుల రుణమాఫీని సింగిల్ టేక్ లో ఎందుకు తీసి పారేయలేకపోతున్నారన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు.
రుణమాఫీని ఒకేదఫా ఎందుకు చేయలేకపోతున్నామో చెప్పిన కేసీఆర్.. అలా చేయాలంటే ఏం చేయాలో చెప్పుకొచ్చారు. కేసీఆర్ చెప్పిన లెక్కలు చూస్తే.. ఓకేసారి రుణమాఫీ అమలు చేయాలంటే రూ.8వేల కోట్లు అవసరమవుతాయని.. తెలంగాణ రాష్ట్రంలో 36 లక్షల రైతు ఖాతాలున్నట్లు చెప్పారు. వీరందరికి లక్ష రూపాయిల లోపు ఒకేసారి రుణమాఫీ అంటే అవసరమయ్యే రూ.8వేల కోట్ల మొత్తం చాలా పెద్దదని స్పష్టం చేశారు.
అంత భారీ మొత్తం సమకూర్చుకోవాలంటే కష్టమని.. ప్రభుత్వం దగ్గర సూట్ కేసుల్లో డబ్బులు ఉండవని చెప్పిన ఆయన.. అంత మొత్తం రావటానికి ఉన్న అవకాశాల్ని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు.
రాష్ట్రంలో వాణిజ్య పన్నుల ద్వారా రూ.3500కోట్లు రాబట్టే పనిలో ప్రభుత్వం ఉందని.. కేంద్ర సర్కారు నుంచి 14వ ఫైనాన్స్ కమిషన్ నుంచి అదనంగా రూ.3500 కోట్లు వస్తాయని.. ప్రభుత్వ స్థలాల అమ్మకం ద్వారా రూ.2 నుంచి రూ.3వేల కోట్లు వచ్చే వీలుందన్నారు. ఈ నిధులన్నీ సమకూరిన వెంటనే రుణమాఫీకి తొలి ప్రాధాన్యం ఇస్తానని చెప్పుకొచ్చారు.
రైతుల సమస్య రాత్రికి రాత్రే పరిష్కారం కాదని.. రైతుల ఆత్మహత్యలు దేశం మొత్తం మీదా ఉన్నాయని చెప్పిన కేసీఆర్.. తెలంగాణ తెచ్చుకున్నది మీ చావుల్ని చూడటానికి కాదు.. ప్లీజ్ ఆత్మహత్యలు వద్దంటూ వ్యాఖ్యానించారు.
ధనిక రాష్ట్రంగా అభివర్ణించుకునే కేసీఆర్ డబ్బు లెక్కలు.. ఆ తర్వాత చేసిన వ్యాఖ్యల్నే చూస్తే.. దేశ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు ఉన్నాయని చెబుతున్న ఆయన.. మరే రాష్ట్ర సీఎం తనకు మాదిరి మాది డబ్బున్న రాష్ట్రమని గొప్పలు చెప్పుకోలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇక.. రుణమాఫీకి అవసరమైన రూ.8వేల కోట్లకు వచ్చే మార్గం చెప్పిన లెక్క చూస్తే.. అదిప్పటికిప్పుడే అయ్యే యవ్వారంగా కనిపించదు.
వాణిజ్య పన్నుల ద్వారా రాబట్టాలని భావిస్తున్న రూ.3500 కోట్లు ఎప్పటికి అవుతుందో చెప్పలేని పరిస్థితి. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సంగతి ఇదే తంతు. ఇక.. ప్రభుత్వ ఆస్తులు అమ్మి సొమ్ము చేయటానికి కనీసం మూడు నుంచి ఆర్నెల్ల వరకూ పట్టే వీలుంది. అంటే.. ఇప్పటికిప్పుడు కాదు కదా కనీసం మూడు నెలలకు కూడా రుణమాఫీ మొత్తంగా తీసేయలేని పరిస్థితుల్లో కేసీఆర్ సర్కారు ఉందన్న విషయం ముఖ్యమంత్రి మాటల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది.
ఓపక్క ప్రాణాలు పోతుంటే.. వారి ప్రాణాల్ని నిలిపేందుకు.. అన్నదాతల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు.. భరోసా కలిగించేందుకు కనీసం ఏదైనా గడువు తేదీ ప్రకటించి.. ఆ సమయం లోపల రుణమాఫీ మొత్తం (రూ.లక్ష లోపు మొత్తాల్ని) ఏక మొత్తంగా తీసి వేస్తామని చెప్పినా బాగుండేది.
రావాల్సిన ఆదాయం గురించి చెబుతున్న కేసీఆర్.. అవి ఎప్పటికి వస్తాయన్న విషయంపై స్పష్టత లేదన్న విషయం ఆయన మాటల్ని చూస్తే అర్థమవుతుంది. పేరుకు ధనిక రాష్ట్రమే తప్పించి.. రూ.10వేల కోట్ల ఖర్చు ఒక్కసారి మీద పడితే.. ఉక్కిరిబిక్కిరి కావాల్సిందేనన్న విషయం కేసీఆర్ మాటల్లో అర్థమవుతుంది.
మాటలు చెప్పినంత ఈజీగా.. పనులు చేయటం అంత సులువు కాదన్న నిజాన్ని కేసీఆర్ పరోక్షంగా తన ప్రసంగం ద్వారా ఒప్పుకున్నట్లుగా కనిపించట్లేదు..? ఇన్ని ఆర్థిక పరిమితులు ఉంచుకొని ఎన్నికల వేళ.. అధికారంలోకి వచ్చేస్తే ఏదో చేసేస్తామని చెప్పే నేతలు.. పవర్ చేతికి వచ్చాక ఎలాంటి మాటలు చెబుతారనటానికి తాజాగా కేసీఆర్ అసెంబ్లీ ప్రసంగమే నిదర్శనంగా చెప్పొచ్చు.