Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు అంత మెమరీ ఏంది బాసూ?
By: Tupaki Desk | 14 March 2016 4:14 AM GMTమిగిలిన వారితో పోలిస్తే రాజకీయ నాయకులకు మెమరీ కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక.. రాజకీయ అధినేతల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెమరీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యక్షంగా బయటపడిన వైనం తాజాగా చోటు చేసుకుంది. నాన్ స్టాప్ గా మాట్లాడటం కేసీఆర్ కు కొత్తేం కాదు. కానీ.. తాజాగా ఆయన చేసిన ప్రసంగంలో ఒక ప్రత్యేకత ఉంది.
ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే పనిలో భాగంగా అసెంబ్లీలో ప్రసంగించారు. అసెంబ్లీలో ఆయన ప్రసంగం నాన్ స్టాప్ గా మూడు గంటలకు కాస్త తక్కువగా దాదాపు 2.40గంటల పాటు సాగింది. ఇదేమీ పెద్ద విషయం కాదని కొట్టి పారేసే వాళ్లు.. ఆ తర్వాత ఆయన.. మండలికి వెళ్లి.. మరో రెండు గంటల పాటు అసెంబ్లీలో తాను చేసిన ప్రసంగాన్ని మరోసారి చేయటం గమనార్హం.
ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రసంగించే సమయంలో తాను ఎంత టెంపోతో ప్రసంగించారో అందులో భావం ఏ మాత్రం మిస్ కాకుండా మాట్లాడటం గొప్పగా చెప్పాలి. అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు దాదాపు కాపీ.. కట్ పేస్ట్ తరహాలోఆయన ప్రసంగించారు. ఒకే ప్రసంగాన్ని రెండుసార్లు.. అంతే ఎమోషన్ తో చెప్పటం చిన్న విషయం కాదు. ఈ సందర్భంగా తన మెమరీ ఎంత బలమైందన్న విషయాన్ని కేసీఆర్చేతల్లో ప్రదర్శించారని చెప్పక తప్పదు.