Begin typing your search above and press return to search.

మోడీ కోసం కేసీఆర్ పెడుతున్న ఖర్చు అంతా?

By:  Tupaki Desk   |   4 Aug 2016 10:06 AM GMT
మోడీ కోసం కేసీఆర్ పెడుతున్న ఖర్చు అంతా?
X
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతకైనా తాను రెఢీ అన్నట్లుగా వ్యవహరించే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆనందం వచ్చినా ఆగ్రహం వచ్చినా తట్టుకోవటం కష్టమేనని చెప్పాలి. తనకు నచ్చిన వారిని ఆకాశానికి ఎత్తేస్తే ఆయన.. కాస్త తేడా వచ్చినా పాతాళానికి తొక్కేస్తూ వ్యాఖ్యలు చేయటం తరచూ కనిపించే అంశమే. మొన్నటికి మొన్న హైకోర్టు విభజన వ్యవహారంలో కేంద్రం తమను పట్టించుకోవటం లేదని.. అవసరమైతే తాను ఢిల్లీలో ధర్నా చేస్తానంటూ ఆయన తీవ్రవ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ నెల ఏడున ప్రధాని మోడీ తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరధ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వస్తున్న ప్రధాని మోడీ పర్యటనను ఘనంగా ఉండేలా కేసీఆర్ డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాని మోడీ వస్తున్న తొలి పర్యటన ఆయనకు ఒక మధురానుభూతి కలిగేలా చేయటంతోపాటు.. ఆయన పాల్గొన్న కార్యక్రమం భారీగా ఎత్తున ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

మోడీ పర్యటన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారన్న వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్న చిన్న మొత్తాలకు సంబంధించిన బిల్లుల్ని పాస్ చేసేందుకు ఆంక్షలు విధిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మోడీ పర్యటన కోసం రూ.50కోట్లు ఖర్చు చేయటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రధాని పాల్గొనే సభ కోసం భారీ వేదికను నిర్మిస్తున్నారు. తెలంగాణ కల్చర్ ఉట్టిపడేలా ఉండే వేదికకు టాప్ ఫ్రూప్ గా వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సభ నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

సభ కోసం 80 ఎకరాల భూమిని చదును చేసి సిద్ధం చేస్తున్నారని.. దాదాపు రెండు లక్షల మంది సభకు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. సభకు దగ్గర్లోని పరిసర గ్రామాల్లో రోడ్ల కోసం రూ.19.5కోట్లు ఖర్చుపెడుతున్న కేసీఆర్.. సభకు వచ్చే వారి భోజనాలు..రవాణా కోసమే రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. చూస్తుంటే.. మోడీ తెలంగాణ పర్యటన ఆయన ఇప్పట్లో మర్చిపోకుండా ఉండేలా కేసీఆర్ డిజైన్ చేస్తున్నారని చెప్పక తప్పదు.