Begin typing your search above and press return to search.

అఖిలేశ్ యాదవ్ ఇజ్జత్ తీసిపారేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   6 Oct 2022 4:45 AM GMT
అఖిలేశ్ యాదవ్ ఇజ్జత్ తీసిపారేసిన కేసీఆర్
X
కొన్ని మాటలు విన్నంతనే బాగానే ఉంటాయి. కానీ.. కాస్తంత పరికించి చూసినంతనే డ్యామేజింగ్ గా ఉంటాయి. అందుకే మాట్లాడే మాటల విషయంలో అప్రమత్తత అవసరం. తనను తాను గొప్పవాడిగా.. ఆదర్శవంతుడిగా అభివర్ణించే వారు.. ఆ మాటల్ని తమ వరకు పరిమితం చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సమస్యల్లా.. మూడో మనిషిని కూడా సీన్లోకి తీసుకొస్తారు. అలాంటి వేళ.. వారి మాటలతో జరిగే నష్టం భారీగా ఉంటుంది. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ను మార్చేసిన వేళ కేసీఆర్ మాటల్లో కొన్ని ఇలానే ఉండటం గమనార్హం.

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయిం సింగ్ యాదవ్ గురించి మాట్లాడిన కేసీఆర్.. ఆయన ఆరోగ్యం సరిగా లేని విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. ములాయం ఐసీయూలో ఉన్నందున తాజా సమావేశానికి ఆయన్ను తానే రావొద్దని చెప్పినట్లుగా కేసీఆర్ పేర్కొనటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి ఆరోగ్యం విషమంగా ఉన్న వేళలో.. తండ్రిని వదిలి ఏ కొడుకు రాజకీయం పేరుతో బయటకు తిరగలేరు.

ఆ మాత్రం ఆలోచన యూపీ లాంటి అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అఖిలేశ్ కు ఉండకుండా ఉంటుందా? ఒకవేళ.. నిజంగానే అఖిలేశ్ కు అలాంటి ఆలోచనలు ఉండవనే అనుకుందాం.

అలాంటి వేళలో ఆయన పరపతికి డ్యామేజ్ జరగకుండా ఉండేలా మాటల్ని మాట్లాడాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంటుంది. కానీ.. ఇదేమీ లేకుండా అఖిలేశ్ ఇమేజ్ దారుణంగా దెబ్బ పడేలా కేసీఆర్ మాటలు ఉన్నాయని చెప్పాలి.

'ములాయం సింగ్ యాదవ్ ఐసీయూలో ఉన్నారు. అందుకే ఈ సమావేశానికి అఖిలేశ్ యాదవ్ ను నేనే రావొద్దని చెప్పా. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావానికి కలుద్దామని చెప్పా' అన్న కేసీఆర్ మాటలు అభ్యంతరకమన్నారు. మిత్రుల ఇజ్జత్ ను కాపాడాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంటుందని.. అందుకు భిన్నంగా ఆయన మాత్రం అఖిలేశ్ యాదవ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా మాట్లాడారన్న మాట వినిపిస్తోంది.

జాతీయ పార్టీ అధినేతగా వ్యవహరించే వేళలో.. తనతో నడిచే వారి గౌరవ మర్యాదలకు లోటు రాకుండా చూడాల్సిన అవసరాన్ని కేసీఆర్ గుర్తించాలన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ విషయాన్ని కేసీఆర్ ఎప్పుడు గుర్తిస్తారో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.