Begin typing your search above and press return to search.

తక్కువ బడ్జెట్..ఎక్కవ లాభం..కేసీఆర్ ప్లాన్

By:  Tupaki Desk   |   22 July 2018 4:16 AM GMT
తక్కువ బడ్జెట్..ఎక్కవ లాభం..కేసీఆర్ ప్లాన్
X
ఏ ముహూర్తాన కేసీఆర్ ‘సకలజనుల సర్వే’ చేశాడో కానీ అప్పటి నుంచి తెలంగాణ గుట్టు మట్టు అంతా తన గుప్పిట పట్టి.. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ప్రయోజనం కలిగించే పథకాలకు రూపకల్పన చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలే కేసీఆర్ చేపట్టిన రైతు బంధు ఎకరాలనికి 4వేలు కానీ.. ఆ తర్వాత రైతు బీమా పథకం కానీ తెలంగాణలోని మెజార్టీ రైతులకు గొప్ప వరమే.. కానీ చిన్న కమతాలు ఎక్కువగా ఉండడం వల్ల కేసీఆర్ కు బడ్జెట్ తక్కువ అయ్యింది. ఇక రైతు బీమా కు అర్హత విషయంలో చాలామంది రైతులు 60 ఏళ్లకు పైబడి ఉండడంతో తెలంగాణలోని దాదాపు 35శాతం మంది రైతులు ఈ పథకాన్ని కోల్పోతున్నారు. ఇలా అన్నీ లెక్కలేసే కేసీఆర్ జాగ్రత్తగా పథకాలు రూపకల్పన చేశారు..

ఇప్పుడు మరో పథకం.. ‘కంటివెలుగు’. కేసీఆర్ ఆ మధ్య వైద్యసిబ్బంది - ఏఎన్ ఎంలతో కలిసి ఇంటింటికి వైద్యపరీక్షలు చేయించారు. ఇందులో కంటి సమస్యలున్న వారిని గుర్తించారు. గ్రామానికి కొంతమంది ఉంటారు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా స్వల్పమే.. దీనికోసం పెద్దగా బడ్జెట్ కూడా కాదు.. అందుకే ఇప్పుడు ఈజీగా ఓ పథకానికి రూపకల్పన చేశారు. కంటివెలుగు పేరుతో ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభించబోతున్నారు.. పథకంలో భాగంగా కంటి సమస్యలున్న వారిని గుర్తించి వారికి చికిత్సలు - కంటిఅద్దాలు సహా అన్ని సమస్యలు తీరుస్తారు.

ఈ పథకానికి నిధులు చాలా స్వల్పంగా ఖర్చవుతాయి. కానీ ప్రయోజనం మాత్రం చాలా వస్తుంది. ప్రజల్లో కేసీఆర్ పై సింపథీ పెరిగిపోతోంది. ఎన్నికల సంవత్సరాన కేసీఆర్ ప్రకటిస్తున్న ఈ పథకాలు తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ప్రయోజనం కలిగించేలా ఉంటున్నాయి. ఎంతైనా తెలంగాణ సమాజం స్థితిగతులన్నీ తెలిసిన కేసీఆర్ ఇలా అద్భుతమైన స్ట్రాటజీని పుణికిపుచ్చుకొని ముందుకుసాగుతున్నారు. ఆశ్చర్యకరంగా కేసీఆర్ పథకాలేవీ ఆయన ప్రకటించే వరకూ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతుండడం విశేషం.