Begin typing your search above and press return to search.
నాలుగురోజులుగా ''వ్యవసాయం'' చేస్తున్న ముఖ్యమంత్రి
By: Tupaki Desk | 28 Jun 2015 9:55 AM GMTకొత్తగా ఏం చేయాలన్నా దానికి దమ్ము.. ధైర్యం చాలానే కావాలి. ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి.. ఫాంహౌస్‌లో నాలుగు రోజుల పాటు ఉండిపోయి.. తన వ్యవసాయ క్షేత్రంలో పంట వ్యవహారాల్ని చూసుకోవటం సాధ్యమయ్యే వ్యవహారమేనా? మిగిలిన ముఖ్యమంత్రుల విషయం ఏమో కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో మాత్రం ఇలాంటి ప్రత్యేకతలు కనిపిస్తాయి.
గతంలో క్యాప్సికం లాంటి వాణిజ్య పంటలు వేసి.. భారీగా లాభాలు గడించిన కేసీఆర్.. తాజాగా అల్లం సాగు మీద దృష్టి పెట్టటం తెలిసిందే. అయితే.. వ్యవసాయ పనుల కోసం ఒకట్రెండు రోజులు ఫాంహౌస్‌లో గడుపుతారన్న మాట వినిపించినప్పటికీ.. అందుకు భిన్నంగా ఏకంగా నాలుగు రోజుల పాటు ఉండటం సరికొత్త ఆసక్తి రేకెత్తిస్తోంది.
కేసీఆర్ లాంటి వ్యక్తి ఏ పని ఊరికే చేయరు. ఆయన వేసే ప్రతి అడుగులోనూ ఎంతోకొంత వ్యూహం ఉంటుంది. అలాంటి వ్యక్తి కామ్‌గా ఉన్నా వెనుక ఏదో జరుగుతుందని.. అందుకే ఆయన వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తుంటారని చెబుతారు. గత నాలుగు రోజులుగా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటే.. తన ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్.. వ్యవసాయం మీద దృష్టి పెట్టారా? లేక.. తన రాజకీయ ప్రత్యర్థులకు ఊహించని షాక్ ఇచ్చేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.