Begin typing your search above and press return to search.
ఫామ్ హౌస్ కి వెళుతున్న కేసీఆర్ కారు ఆగింది
By: Tupaki Desk | 4 Aug 2017 4:35 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కాస్త నాటకీయంగా ఉంటుంది. తాను అమితంగా ఆరాధించే ఎన్టీఆర్ కు తగ్గట్లే కేసీఆర్.. అప్పుడప్పడు తనదైన తీరుతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తారు. తిట్టిన తిట్టకుండా తిట్టేసి.. నా కొడుకులన్న పెద్దమాటను క్యాజువల్ గా అదే పనిగా విపక్షాలపై ప్రయోగించిన కేసీఆర్.. అది జరిగిన రోజు తర్వాత తనదైన శైలిలో వ్యవహరించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
పామ్ హౌజ్ కు వెళ్లే క్రమంలో కేసీఆర్ గురువారం రాజీవ్ రహదారి మీదుగా వెళ్లాల్సిన ఆయన.. తన కాన్వాయ్ రూటు మార్చారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం అలియాబాద్ - లక్ష్మాపూర్ దారిలో వెళ్లారు. కేసీఆర్ కాన్వాయ్ ను చూసేందుకు రోడ్ల మీదకు వచ్చిన గ్రామస్తులకు షాకిస్తూ.. ఆయన రోడ్డు మీద తన కారును ఆపించారు. కారులో నుంచి దిగిన కేసీఆర్ ప్రజల వద్దకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మిషన్ భగీరథ గురించి అడిగారు. దీంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన కేశవరం గ్రామస్తులు ఒక అడుగు ముందుకేసి.. తమ గ్రామాన్ని ముఖ్యమంత్రి దత్తత తీసుకోవాలని కోరారు. అయితే.. ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ఆయన.. ఎక్కువ నిధులు ఇచ్చి సమస్యల్ని తీరుస్తానన్నారు.
పేకాట పూర్తిగా పోయిందా? అంటూ మహిళల్ని ప్రత్యేకంగా అడిగిన కేసీఆర్.. కరెంటు సరఫరా ఎలా ఉంది? రఐతులకు 24 గంటల కరెంటు ఇస్తే ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నల్ని అడిగారు. అయితే.. రైతులకు 15 గంటలు నాన్ స్టాప్ గా కరెంటు ఇస్తే సరిపోతుందని.. ఇరవైనాలుగు గంటలూ అక్కర్లేదని రైతులు చెప్పటం గమనార్హం.
రోజంతా కరెండు ఇస్తే.. మోటార్లు చెడిపోతాయంటూ రైతులు సీఎం కేసీఆర్ కు చెప్పారు. ఫించను పొందే వయసు ఉన్నా.. ఆధార్ కార్డులో తప్పుగా పేర్లు నమోదు కావటంతో తమకు ఫించన్లు రావటం లేదని పలువురు వృద్ధులు చెప్పటంతో.. త్వరలోనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పంపుతానని.. రెండు మూడు నెలల్లో సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన కేసీఆర్.. తిరిగి తన ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు. ఊహించని రీతిలో కారు ఆగి సర్ ప్రైజ్ చేసిన కేసీఆర్.. తన మాటలతో గ్రామస్తుల మనసుల్ని దోచుకున్నారని చెప్పక తప్పదు.