Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ కోసం ఆగిన కేసీఆర్ కాన్వాయ్!

By:  Tupaki Desk   |   28 Jun 2019 4:37 AM GMT
జ‌గ‌న్ కోసం ఆగిన కేసీఆర్ కాన్వాయ్!
X
మూడు రోజులు హైద‌రాబాద్‌ లో ఉండ‌టానికి వీలుగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం హైద‌రాబాద్ చేరుకున్న సంగ‌తి తెలిసిందే. అనంత‌రం ఆయ‌న త‌న నివాస‌మైన లోట‌స్ పాండ్ కు బ‌య‌లుదేరారు. తెలంగాణ భ‌వ‌న్ మీదుగా ఆయ‌న కాన్వాయ్ వెళుతుంది.

జ‌గ‌న్ కాన్వాయ్ తెలంగాణ భ‌వ‌న్ మీదుగా వెళ్లే స‌మ‌యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాన్వాయ్ కూడా బ‌య‌లుదేరాల్సి ఉంది. ప్ర‌ముఖ సినీన‌టి విజ‌య‌నిర్మ‌ల మ‌ర‌ణించిన నేప‌థ్యంలో ఆమెకు నివాళులు అర్పించేందుకు ఆయ‌న నానాక్ రాం గూడకు బ‌య‌లుదేరాల్సి ఉంది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ కాన్వాయ్ త‌మ పార్టీ కార్యాల‌యం మీదుగా వెళుతున్న విష‌యాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనూహ్య నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

త‌న ప్ర‌యాణాన్ని కాస్త మార్చుకున్నారు. త‌న వాహ‌న శ్రేణిని జ‌గ‌న్ కాన్వాయ్ వెళ్లే వ‌ర‌కూ అలానే ఉంచేలా ఆదేశాలిచ్చారు. దీంతో.. జ‌గ‌న్ కాన్వాయ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లే అవ‌కాశం ఇచ్చారు. జ‌గ‌న్ ప్ర‌యాణిస్తున్న కాన్వాయ్ కు ఇబ్బంది క‌లుగ‌కుండా ఉండ‌టానికి రెండు.. మూడు నిమిషాల‌ పాటు త‌న కాన్వాయ్ ను తెలంగాణ భ‌వ‌న్ లోప‌లే ఉంచేసిన‌ట్లుగా తెలుస్తోంది. జగ‌న్ కాన్వాయ్ వెళ్లిన కాసేప‌టికి కేసీఆర్ కాన్వాయ్ బ‌య‌లుదేరి వెళ్లిపోయింది.

రాజ‌కీయంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల మ‌ధ్య స్నేహ‌బంధం అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డుతున్న వేళ‌.. త‌న మిత్రుడికి ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి త‌న ప్ర‌యాణాన్ని రెండు.. మూడు నిమిషాలు ఆపుకోవ‌టం ఆస‌క్తిక‌ర అంశంగా చెబుతున్నారు.

జ‌గ‌న్ కాన్వాయ్ త‌న పార్టీ ఆఫీసు మీదుగా వెళుతున్న వేళ‌.. రెండు.. మూడు నిమిషాలు త‌న వాహ‌న‌శ్రేణిని నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. ఇదో శుభ‌సూచ‌కంగా చెబుతున్నారు. త‌న రాష్ట్రానికి అతిధిగా వ‌చ్చిన ప‌క్క రాష్ట్ర ముఖ్య‌మంత్రిని గౌర‌వించుకోవ‌టం మంచి ప‌రిణామంగా చెప్ప‌క త‌ప్ప‌దు.