Begin typing your search above and press return to search.

ఆప‌రేష‌న్ క్లీన్ స్వీప్ ను ఆపేసిన కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   16 May 2019 5:45 AM GMT
ఆప‌రేష‌న్ క్లీన్ స్వీప్ ను ఆపేసిన కేసీఆర్‌!
X
ఒక‌సారి ఫిక్స్ అయ్యాక నా మాట నేనే విన‌న‌ని చెప్పే హీరో క్యారెక్ట‌ర్ రీల్ లో చూశాం. రియ‌ల్ గా ఇదే తీరును ప్ర‌ద‌ర్శిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఏ విష‌యంలోనూ ఆయ‌న అంత ప‌ట్టుద‌ల‌గా ఉండ‌రు కానీ.. ఒక‌సారి డిసైడ్ అయితే మాత్రం.. దాని సంగ‌తి తేల్చేందుకు ఏ మాత్రం వెనుకాడ‌ని తత్త్వం ఆయ‌న సొంతం.

తెలంగాణ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో వంద ప్ల‌స్ సీట్ల‌ను టార్గెట్ చేసిన కేసీఆర్ కోరిక పూర్తి కాలేద‌న్న తెలిసిందే. ఎన్నిక‌ల ముగిసిన రెండు నెల‌ల‌కేఆప‌రేష‌న్ క్లీన్ స్వీప్ షురూ చేసిన ఆయ‌న తీరు సంచ‌ల‌నంగా మారింది. తొలుత టీడీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీలో క‌లిపేసుకున్న కేసీఆర్‌.. ఆ పార్టీ ఉనికే లేకుండా చేశార‌ని చెప్పాలి.

ఇక‌.. కాంగ్రెస్ మీద ఫోక‌స్ చేసిన ఆయ‌న‌.. తాను అనుకున్న ఫిగ‌ర్ కు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేశారు కూడా. కాంగ్రెస్ ను టీఆర్ఎస్ లో విలీనం చేసుకునే కార్య‌క్ర‌మాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ఇందుకుసంబంధించిన ఆప‌రేష‌న్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఇలాంటి వేళ‌.. తన ఆప‌రేష‌న్ ను తాజాగా హోల్డ్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తాను అనుకున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కాకుండా.. యూపీఏకు మ‌ద్ద‌తు ప‌ల‌కాల్సి వ‌స్తుంద‌న్న ఆలోచ‌న‌తో త‌న ఆప‌రేష‌న్ ను నిలిపిన‌ట్లుగా చెబుతున్నారు. తొలుత అనుకున్న‌ట్లు ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే కంటే ముందే.. విలీన కార్య‌క్ర‌మాన్నిక్లోజ్ చేయాల‌ని భావించిన కేసీఆర్‌.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో ఆయ‌న త‌న ఆప‌రేష‌న్ ను వాయిదా వేశార‌ని చెబుతున్నారు.

అవ‌స‌ర‌మైతే కాంగ్రెస్ తో దోస్తానా క‌ట్టాల్సి ఉన్న వేళ‌.. వారి పార్టీ ఉనికి తెలంగాణ‌లో చేయ‌టం ద్వారా.. ఇబ్బందులుకొని తెచ్చుకోవ‌టం స‌రికాద‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. అందుకే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత‌.. జాతీయ స్థాయిలో నెల‌కొన్న స‌మీక‌ర‌ణాల‌కు త‌గ్గ‌ట్లు త‌న ఆప‌రేష‌న్ కొన‌సాగించాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.