Begin typing your search above and press return to search.

రాష్ట్రపతిని ఆహ్వానించని కేసీఆర్.. ఎవరిని పంపాడో తెలుసా?

By:  Tupaki Desk   |   26 Dec 2022 2:09 PM GMT
రాష్ట్రపతిని ఆహ్వానించని కేసీఆర్.. ఎవరిని పంపాడో తెలుసా?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ మోడీని స్వాగతించడానికి అస్సలు రాష్ట్రంలోనే ఉండరు. ఆ టైంలో ఢిల్లీకినో లేదంటే మరో రాష్ట్రానికి పర్యటన పెట్టుకుంటారు. ఇక కనీసం భారత దేశ ప్రథమ పౌరురాలు అయిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును కూడా స్వాగతించడానికి కేసీఆర్ కు ధైర్యం చాల్లేదు.

తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది పర్యటిస్తున్నారు. రాష్ట్రపతికి కేసీఆర్ స్వయంగా స్వాగతం పలుకుతారని అందరూ అనుకున్నారు. కానీ ఊహించినట్టుగానే సీఎం కేసీఆర్ రాష్ట్రపతిని కూడా ఆహ్వానించలేదు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతి రాథోడ్, ఉన్నతాధికారులు స్వాగతం పలకడం చర్చనీయాంశమైంది.

ద్రౌపదిని ఆహ్వానించడానికి సత్యవతిని పంపడం వెనుక కేసీఆర్ వ్యూహం అందని అంటున్నారు. గిరిజన తెగకు చెందిన రాష్ట్రపతికి అదే గిరిజన మహిళా మంత్రిని ఎంపిక చేయడం విశేషం.

నిజానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఓ గిరిజన తెగకు చెందిన మహిళకు రాష్ట్రపతి పదవి ఇవ్వడానికి ద్రౌపదిని బీజేపీ ఎంపీక చేసింది. అయితే బీజేపీలో గొడవల కారణంగా కేసీఆర్ మద్దతు ఇవ్వలేదు. మమతా బెనర్జీ బలపరిచిన యశ్వంత్ సిన్హాకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇచ్చారు.

అంతేకాదు హైదరాబాద్ కు వచ్చిన యశ్వంత్ కు మద్దతుగా నాటి బీఆర్ఎస్ పెద్ద క్యాంపెయిన్ చేసింది. కేసీఆర్ స్వయంగా పాల్గొని మరీ ఓట్లు వేస్తామని చెప్పారు.

హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లారు. ఏపీ పర్యటన ముగిసిన తర్వాత తిరిగి ఆమె హైదరాబాద్ వచ్చారు. హెలిక్యాప్టర్ లో హకీంపేట ఎయిర్ బేస్ కు చేరుకున్నారు. ఇక శీతాకాలం విడది కోసం రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో ఐదురోజులు బస చేయనున్నారు. దీనికైనా కేసీఆర్ వెళ్లి హాజరు అవుతారా? అన్నది వేచిచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.