Begin typing your search above and press return to search.

కేసీఆర్ ద్విముఖ వ్యూహం.. బీజేపీపై ఫైర్ వెనుక‌.. స్టోరీ ఇదే!

By:  Tupaki Desk   |   9 Nov 2021 2:30 AM GMT
కేసీఆర్ ద్విముఖ వ్యూహం.. బీజేపీపై ఫైర్ వెనుక‌.. స్టోరీ ఇదే!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఏం చేసినా.. ముందు వెనుకా ఆలోచించే చేస్తార‌ని.. అడుగు తీసి అడుగు వేస్తే.. ఆయ‌న అనేక లాభాలు చూసుకుంటార‌ని.. ఆయ‌న గురించి తెలిసిన వారు చెబుతారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల్లో ఆయ‌న ఇలానే చేశార‌ని అంటున్నారు. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో ఛీ కొట్టిన వారినే త‌ర్వాత‌.. అక్కున చేర్చుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. వాటిని ఆయ‌న స‌మ‌ర్ధించుకున్నారు కూడా. అవ‌న్నీ.. రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లుగా చెప్పుకొచ్చారు. వీటిని తెలంగాణ స‌మాజం కూడా అర్ధం చేసుకుంది.

ఇక‌, ఇప్పుడు తాజాగా ఆయ‌న బీజేపీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోంద‌ని ఆయ‌న అనుకు న్నారో.. లేక‌.. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో వ‌చ్చిన ఫ‌లితం కార‌ణంగా.. బీజేపీని ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నార‌నే భావ‌న కావొచ్చు.. కేసీఆర్‌.. బీజేపీపై దుమ్మెత్తి పోశారు. ఇదీ.. ఇప్ప‌టి వ‌ర‌కు చెబుతున్న మాట‌. కానీ.. కేసీఆర్ వ్యాఖ్య‌ల వెనుక మ‌రో కోణం.. కూడా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి కేసీఆర్ టార్గెట్ చేయాల ని అనుకుంటే.. కేవ‌లం రాష్ట్ర బీజేపీని టార్గెట్ చేస్తే.. స‌రిపోతుంది. ఎందుకంటే.. రాష్ట్రంలో బీజేపీని ఎద‌గ కుండా.. చేయాల‌నే ఎత్తుగ‌డ ఉండి ఉంటే.

కానీ, ఒక్క రాష్ట్రంలోనే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా బీజేపీని ఆయ‌న ఏకేశారు. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై కేసీఆర్ వ్యాఖ్య‌లు అంత తీసిపారేసేవి కావు. ఇది జాతీయ మీడియాలోనూ ప్ర‌ధానంగా చోటు ద‌క్కించుకు న్నాయి. అదేస‌మ‌యంలో దేశానికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను కూడా కేసీఆర్ ప్ర‌స్తావించారు. నేపాల్‌, బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాల జీడీపీని ఆయ‌న ప్ర‌స్తావిస్తూ.. మోడీ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. వాస్త‌వాని కి రాష్ట్రంలో బీజేపీని క‌ట్ట‌డి చేయాలని అనుకుంటే.. దేశ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించే అవ‌కాశం ఉండ‌దు. కానీ, అలా చేయ‌లేదు.

అదేస‌మ‌యంలో స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ల‌ను కూడా కేసీఆర్ ప్ర‌స్తావించారు. నిజానికి ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. దేశ స‌రిహ‌ద్దుల గురించి.. ఈ విష‌యంలోనూ బీజేపీ విఫ‌ల‌మైంద‌ని.. చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. వ్యూహం వేరే అయిన‌ప్పుడు.. ఇలానే వ్యాఖ్యానిస్తారు. కేసీఆర్‌.. ఒక్క హుజూరాబాద్ నెపంతోనే బీజేపీపై దుమ్మెత్తి పోయ‌లేదు. ఇప్పుడు కేంద్ర రాజ‌కీయాల్లో.. ముఖ్యంగా మోడీ వంటి నాయ‌కుడిని ఢీ కొట్టే విష‌యంలో ఒక శూన్య‌త ఆవ‌రించింది. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి కొన్నాళ్లు ఊగినా.. ఆమెతో క‌లిసి వ‌చ్చే నేత‌లు క‌నిపించ‌డం లేదు.

దీంతో ఇప్పుడున్న శూన్య‌త‌ను గుర్తెరిగిన కేసీఆర్‌.. త‌న‌కు అనుకూలంగా జాతీయ రాజ‌కీయాల‌ను మ‌లు చుకునే ప్ర‌య‌త్నంలో భాగంగానే ఈ అడుగులు వేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం కేంద్రం దృష్టి అంతా కూడా.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌పై ఉంది. మ‌రో ఆరు మాసాల్లో ఈ ఎన్నిక‌లు పూర్త‌వుతాయి. ఈ లోగా.. ఢిల్లీలో త‌న స‌త్తా నిరూపించుకుంటే.. ఐదు రాష్ట్రాల్లో బీజేపీపై ప్ర‌భావం ప‌డేలా చ‌క్రం తిప్ప‌గ‌లిగితే.. ఆయా రాష్ట్రాల్లో మూడు చోట్ల అయినా.. బీజేపీని ఓడించ‌గ‌లిగితే.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తిష్ట వేసుకునే అవ‌కాశం ఉంది. సో.. ఈ వ్యూహంతోనే కేసీఆర్ రెచ్చిపోయి ఉంటార‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.