Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌.. కేసీఆర్‌కు ఇంత త‌క్కువ‌య్యాడా..?

By:  Tupaki Desk   |   25 May 2022 8:30 AM GMT
జ‌గ‌న్‌.. కేసీఆర్‌కు ఇంత త‌క్కువ‌య్యాడా..?
X
ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యం తెలంగాణ మంత్రులు ఏమ‌నుకుంటున్నారు? వారి ఆలోచ‌న ఎలా ఉంది? అనే విష‌యాలు త‌ర‌చుగా మీడియా ముందుకు వ‌స్తూనే ఉన్నాయి. ప‌క్క రాష్ట్రంలో అంటూ.. ఏపీ పై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపిస్తూనే ఉన్నారు. ఏకంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ ఇటీవ ల పొరుగు రాష్ట్రంలో రోడ్లు గుంత‌లు ప‌డ్డాయి.. అక్క‌డ నుంచివ‌చ్చి ఫ్రెండ్స్ చెప్పారంటూ కామెంట్లు చేశా రు. దీనిపై రెండు రాష్ట్రాల మ‌ధ్య రచ్చ రేగింది.

అయితే.. ఇప్పుడు తాజాగా.. ఏపీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ లు దావోస్ వేదిక‌గా క‌లుసుకు న్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్.. జ‌గ‌న్‌ చేయి చేయి క‌లుపుకొని అత్యంత స‌మీపంగా హ‌త్తుకున్నారు. ఈ ఫొటోల‌ను.. స్వ‌యంగా కేసీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. అంతేకాదు.. "తన సోదరుడు జగన్‌తో మంచి సమావేశం జరిగిందని" మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తెలిపారు. ఇద్దరు నేతలు సరదాగా పలకరించుకున్నారు. సూటూ బూటు ధరించి... ఫొటోలకు పోజులిచ్చారు.

క‌ట్ చేస్తే.. ఇదే దావోస్ స‌ద‌స్సుకు మ‌హారాష్ట్ర నుంచి యువ నాయ‌కుడు, సీఎం త‌న‌యుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే వ‌చ్చారు. ఈయ‌న‌ను కూడా కేటీఆర్ క‌లుసుకున్నారు. ఈసంద‌ర్భంగా.. ఠాక్రేకు జ్ఞాపిక‌ను ఇచ్చిన కేటీఆర్‌.. శాలువాతో కూడా స‌త్క‌రించారు.

దీనికి సంబందించి కూడా ఆయ‌న పోటోలు పోస్టు చేశారు. దీనికి "యువ‌, డైన‌మిక్ నాయ‌కుడు ఆదిత్య‌ఠాక్రేతో స‌మావేశం కావటం ఎంతో ఆనందంగా ఉంద‌ని, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌లు క‌ల‌సి ప‌నిచేయ‌టానికి అవ‌కాశం ఉన్న రంగాలు ఏమిట‌నే అంశంపై లోతుగా చ‌ర్చించాం. బ‌ల‌మైన రాష్ట్రాలు..బ‌ల‌మైన కేంద్రం" అంటూ ట్వీట్ చేశారు.

ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. 151 సీట్ల‌తో విజ‌యం ద‌క్కించుకున్న జ‌గ‌న్‌తో కేవ‌లం ఒక ఫొటో దిగి.. స‌రిపుచ్చిన కేటీఆర్‌.. అల‌యెన్స్‌తో అధికారంలోకి వ‌చ్చిన ఠాక్రేకు ఇలా మ‌ర్యాద‌లు చేయ‌డం.. శాలువాలు క‌ప్ప‌డం.. జ్ఞాపిక‌లు ఇవ్వ‌డం.. క‌లిసి ప‌నిచేస్తామ‌ని చెప్ప‌డం.. వంటివి చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.

అంటే ఏపీతో క‌ల‌సి తాము చేయాల్సింది ఏమీలేద‌ని కెటీఆర్ చెప్ప‌క‌నే చెప్పార‌నే వ్యాఖ్య‌లు విన్పిస్తున్నాయి. సో.. దీనిని బ‌ట్టి..జ‌గ‌న్ అంటే మ‌రీ ఇంత చుల‌క‌న అయిపోయాడా! అనే చ‌ర్చ కూడా న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం.