Begin typing your search above and press return to search.
గ్రేటర్ కోసం కేసీఆర్ 3 వ్యూహాలు
By: Tupaki Desk | 6 Dec 2015 10:32 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనే పేరుతో శరవేగంగా చేరికలను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ అంతటితోనే ఆగిపోవడం లేదు! త్వరలో జరుగనున్న ఎన్నికల్లో జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ఆలోచనతో మూడంచెల వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. అధికార పార్టీ తరఫున ఇప్పటికే అమలు చేస్తున్న ఆకర్ష్ పథకానికి మరో రెండు పథకాలను పెద్ద ఎత్తున కార్యరూపంలోకి తీసుకురావటం ద్వారా జీహెచ్ ఎంసి ఎన్నికల్లో కూడా వరంగల్ ఉన ఎన్నిక ఫలితాన్నే పునరావృతం చేయాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు.
ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ టీఆర్ ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకర్ష్ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జీహెచ్ ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాజధాని ప్రాంతంలో ప్రతిపక్షాల్లో బలమైన నేతలుగా ముద్ర పడిన వారిని పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఈ విధంగా టీటీడీపీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ - తీగల కృష్ణారెడ్డి - మాధవరం కృష్ణారావు - మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులను పార్టీలోకి చేర్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా ఒకరిద్దరు నేతలు టిఆర్ ఎస్ లో చేరినా బాగా నష్టపోయింది మాత్రం టీటీడీపీనే. మరో 15 రోజుల్లో ఇరు పార్టీల నుంచి మరికొందరు నేతలను లాక్కునే ఉద్దేశ్యంతో సీఎం పక్కా వ్యూహాలు రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నగరానికి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ త్వరలో పార్టీని వీడుతారంటూ జరుగుతున్న ప్రచారం ఇందులో భాగమే.
ఇక, అభివృద్ది, సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేయటం ద్వారా ఓటర్ల మద్దతు పొందటం మరో మార్గం. ఇందులో భాగంగానే ఇటీవలే నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ళను లబ్దిదారులకు పంపిణీ చేసారు. దానికి తోడు అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలు - ఇళ్ళు - అపార్ట్ మెంట్లను క్రమబద్దీకరించేందుకు దరఖాస్తులను ఆహ్వానించటం - కుకట్‌పల్లి - నవాబ్ పేట - పఠాన్ చెరువు తదితర ప్రాంతాలకు గోదావరి నీటిని సరఫరా చేయటం, మౌళిక సదుపాయలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయటం లాంటి చర్యలను ముఖ్యమంత్రి మొదలుపెట్టారు. దాంతో తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గి సానుకూలత పెరుగుతుందని కేసీఆర్ యోచనగా చెబుతున్నారు. ఎటుతిరిగీ ప్రతిపక్షాలు జీహెచ్ ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో గట్టి నేతలను రంగంలోకి దింపే స్దాయిలో లేవు కాబట్టి టీఆర్ఎస్‌కే ఓట్లు వేస్తారన్న అంచనాలో ముఖ్యమంత్రి ఉన్నారు. దానికితోడు పలువురు మంత్రులు జీహెచ్ఎంసి పరిదిలో వివిధ కార్యక్రమాల పేరుతో పెద్ద ఎత్తున పర్యటిస్తుండటం కూడా గమనార్హం.
ఇక, చివరిదైన మూడో పథకమేమిటంటే జీహెచ్ఎంసీ పరిధిలోని సీమాంధులను గుర్తించటం. మొత్తం ఓట్లలో సీమాంధ్రుల ఓట్లెన్ని, అందులో కూడా ఏ డివిజన్లో ఎన్ని ఓట్లున్నాయి, సామాజిక వర్గం వారీగా కూడా ఓట్ల వివరాలను ముఖ్యమంత్రి సేకరిస్తున్నారు. దీని ఆధారంగా వచ్చే ఎన్నికల్లో సీమాంధ్రుల తరపున గట్టి వారనుకున్న వారిలో కొందరిని టీఆర్ఎస్ తరపున పోటీకి దింపాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీమాంధ్రుల ఓటర్ల వివరాలు, గట్టి వారిని గుర్తించటం, వారిలో పోటి చేసే ఆసక్తి వున్నవారితో మాట్లాడటం లాంటి బాధ్యతలను కేసీఆర్ తనయుడు కేటీఆర్ తో పాటు సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు అప్పగించారు. ఇప్పటికే వీరిద్దరు నగర శివారు ప్రాంతాల్లో వివిధ సామాజిక వర్గాలతో మూడు సార్లు సమావేశాలు కూడా నిర్వహించారు. ఎన్నికల్లో సీమాంధ్రులను టీఆర్ ఎస్ తరపున పోటీకి దింపటమంటే తమకు తెలంగాణా, సీమాంధ్ర బేధాలు లేవని చెప్పటమే అన్నది అసలు వ్యూహం. పోటీకి నిలబెట్టే వాళ్ళలో ఎందరు గెలిచారన్నది ముఖ్యం కాదని ఆ పేరుతో తమకు పడే ఓట్లే ముఖ్యమని కెసిఆర్ భావిస్తున్నారు.
మొత్తంగా మూడంచెల వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయటం.. ఈ క్రమంలో అందుబాటులో ఉండే ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోకుండా..బల్దియా పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున్నే ఆపరేషన్ నడిపిస్తున్నారు.