Begin typing your search above and press return to search.
కల్వకుంట్ల చంద్రశేఖర్ 'రెడ్డి' వ్యూహం
By: Tupaki Desk | 10 Dec 2015 11:30 AM GMT రాజకీయ వ్యూహాల్లో దిట్టయిన కేసీఆర్ తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలనూ కైవసం చేసుకునే దిశగా రకరకాల ఎత్తుగడలు వేశారు. అందులో ఆయన వేసి ''రెడ్డి ప్లాన్" ప్రత్యేకంగా నిలుస్తోంది. అందరు నేతల్లానే కేసీఆర్ కూడా సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యమిచ్చే మనిషని చెప్తుంటారు... ఇక బీసీ అవసరాల మేరకు ఏ ఎన్నికలైనా టిక్కెట్లలో వారికి ప్రాధాన్యముంటుంది. కానీ, ఈ సంప్రదాయ సమీకరణాలను పక్కనపెట్టి కేసీఆర్ మునుపెన్నడూ లేనట్లుగా రెడ్డి నేతలకు సగం టిక్కెట్లు కేటాయించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మొత్తం 12 స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా అందులో ఆరు స్థానాల్లో టీఆరెస్ అభ్యర్థులుగా రెడ్లే ఉన్నారు.
రెడ్డి సామాజిక వర్గాన్ని టీఆరెస్ కు దగ్గర చేసే లక్ష్యంతో ఒక్కసారిగా వారిలో ఆకర్షణ కలిగించేందుకు ఇంత భారీ మొత్తంలో టిక్కెట్లు కేటాయించారు. మరోవైపు జీహెచ్ ఎంసీ ఎన్నికలూ రానుండడం.. రాయలసీమ, తెలంగాణ రెడ్ల మధ్య బంధుత్వాలు భారీగా ఉండడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని రాయలసీమ రెడ్లు గ్రేటర్ ఎన్నికల్లో టీఆరెస్ కు అండగా నిలిచేలా చేసేందుకు రెడ్లకు ప్రాధాన్యం ఇచ్చి ఆ సామాజివర్గంలో ఆశలు కల్పిస్తున్నారు.
టీఆరెస్ అభ్యర్థుల్లో రెడ్లు వీరే..
సుంకిరెడ్డి జగదీశ్‌రెడ్డి- మహబూబ్‌నగర్
కసిరెడ్డి నారాయణరెడ్డి-మహబూబ్ నగర్
పట్నం నరేందర్ రెడ్డి- రంగారెడ్డి
భూపాల్ రెడ్డి-మెదక్
భూపతిరెడ్డి- నిజామాబాద్
తేరా చిన్నపరెడ్డి- నల్గొండ