Begin typing your search above and press return to search.
మౌనంతో ఉక్కిరిబిక్కిరి చేయటమే కేసీఆర్ మాస్టర్ ఎజెండానా?
By: Tupaki Desk | 21 Nov 2019 6:28 AM GMTఉమ్మడిరాష్ట్రంలో ముఖ్యమంత్రులకు ఎవరైనా సమ్మె చేస్తున్నారంటే బింకంతో ఉన్నప్పటికీ.. సమ్మె ప్రారంభమయ్యాక దాన్ని ముగింపు పలికేందుకు ప్రభుత్వాలు ఆరాటపడటం.. మొత్తం గా కాకున్నా.. అన్నో ఇన్నో డిమాండ్లకు ఓకే చెప్పి ఇష్యూను క్లోజ్ చేద్దామన్నట్లుగా ఉండేవారు. కానీ.. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న సీన్ అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.
తన ఇష్టానికి వ్యతిరేకంగా షురూ చేసిన ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ తానేం అనుకున్నారో.. చివరకు అదే జరిగేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. దాదాపు ఆరువారాలకు పైగా సాగుతున్న సమ్మెను కొనసాగించే ఓపిక తమకు లేదన్న విషయాన్ని టీఎస్ ఆర్టీసీ జేఏసీ తేల్చేసింది. తొలుత చేసిన బెట్టును పక్కన పెట్టి.. షరతుల్లేకుండా విధుల్లోకి తీసుకునే వాతావరణాన్నికల్పిస్తే సమ్మె విరమణకు తాము సిద్ధంగా ఉన్నట్లు జేఏసీ స్పష్టం చేస్తోంది.
మొదట్లో హైకోర్టు మీద ఆశలు పెట్టుకున్నా.. అలాంటిదేమీ జరగదన్న విషయాన్ని అర్థం చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. కోర్టులు ఏమీ చేయలేవన్న వైనాన్ని సీఎం కేసీఆర్ గతంలోనే స్పష్టం చేయటం.. పరిధి దాటి లోపలకు రాలేవన్న సారు మాటలకు తగ్గట్లే న్యాయస్థానాలు ఒక స్థాయి దాటిన తర్వాత తాము జోక్యం చేయలేమన్న నిస్సహాయతను వ్యక్తం చేయటం తెలిసిందే.
దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన జేఏసీ.. సమ్మె విరమణకు ముందుకు వచ్చింది. నిజానికి ఇలాంటి సీన్ కు వేరే ముఖ్యమంత్రి అయితే.. వెనువెంటనే రియాక్ట్ అయ్యేవారు. కానీ.. అలా చేస్తే ఆయనెందుకు కేసీఆర్ అవుతారు. సమ్మె విషయంలో తానేం చేయాలనుకున్నానో అలా జరుగుతున్న వేళ.. బాగా కాలిన ఇనుమును తనకు తగ్గట్లుగా మార్చుకునే తీరును ప్రస్తుత సీఎం ప్రదర్శిస్తున్నారని చెప్పాలి.
తన మాట కాదని సమ్మెకు వెళితే ఎలాంటి తప్పలు తప్పవన్న వైనాన్ని తాజాగా ఆర్టీసీ కార్మికుల ఎపిసోడ్ తో స్పష్టం చేస్తున్న కేసీఆర్.. విరమణకు సిద్ధమన్న తర్వాత కూడా రియాక్ట్ కాకుండా ఉండటం ద్వారా అన్ని వర్గాలు తన చెప్పు చేతల్లో ఉండాల్సిన అవసరం ఏమిటో చెప్పేప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు. తనకు తానుగా స్పందిస్తే తప్పించి.. ఆర్టీసీ సమ్మె వ్యవహారం ఒక కొలిక్కి రాదన్న వైనాన్ని కేసీఆర్ స్పష్టం చేశారు.
గతంలో తాను రెండుసార్లు విరమణకు ఆఫర్లు ఇచ్చినా అందుకు స్పందన లేని వేళ.. ఇప్పుడు కార్మికులు దిగి వచ్చినంత మాత్రాన స్పందించాల్సిన అవసరం ఏముందన్నట్లుగా తెలంగాణ సీఎం వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు.
సమ్మె విరమణ ప్రతిపాదనను బుధవారం సాయంత్రం జేఏసీ నోటి నుంచి వచ్చినా తెలంగాణ సర్కారు మాత్రం మౌనంగానే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సమ్మె విషయంలో సీరియస్ గా ఉన్న కేసీఆర్.. ఆర్టీసీ ఉద్యోగులు మరో నాలుగు మెట్లు దిగే వరకూ మౌనంగా ఉంటారనే అంటున్నారు. తన తీరుతో ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేయటమే కాదు.. ఊపిరి ఆడకుండా చేయటమే లక్ష్యమంటున్నారు. తన మాట కాదని సమ్మె చేసి తన ఇమేజ్ ను దెబ్బ తీసిన కార్మికులకు తానేమిటో చూపించే అవకాశం వచ్చినప్పుడు.. అలాంటి అరుదైన అవకాశాన్ని కేసీఆర్ మాత్రం ఎందుకు వదులుకుంటారు?