Begin typing your search above and press return to search.
హరీశ్ కు కేసీఆర్ అలా కత్తెరేశారా?
By: Tupaki Desk | 12 Nov 2015 4:55 AM GMTతెలంగాణ రాజకీయాల్లో ఒక అంశంపై ఈ మధ్య కాలంలో జోరుగా సాగుతోంది. తెలంగాణ అధికారపక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తిరుగులేకుండా ఉన్నప్పటికీ.. నెంబరు టూ విషయంలో భిన్నమైన పరిస్థితి నెలకొని ఉండటం తెలిసిందే. కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్.. మేనల్లుడు హరీశ్ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న విషయం అందరికి ఎరుకే. ఈ విషయంలో ఉన్న ఇబ్బందిని గుర్తించి.. కేసీఆర్ సైతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుంటారు తప్పించి.. సీరియస్ గా తీసుకున్నది లేదు.
నిజానికి కేసీఆర్ అంటే విపరీతమైన భయభక్తులున్న కేటీఆర్.. హరీశ్ లు.. ఆయన కానీ ఈ లొల్లి విషయాన్ని పంచాయితీగా పెడితే.. ఇరువురు నేతలు నోటికి తాళం వేసుకొని కూర్చుంటారన్నది తెలిసిందే. అయితే.. కొన్ని విషయాల్ని మాట్లాడటం కాదుకదా.. అసలు అలా ఆలోచిస్తున్నారన్న భావన కలిగించటం కూడా మంచిది కాదు. అలాంటి మంచిచెడ్డల ఏమిటి? వాటి విషయంలో ఎలా వ్యవహరించాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే.. ఆయన ఇరువురు నేతల మధ్య నడిచే కోల్డ్ వార్ ను లైట్ తీసుకున్నట్లు కనిపిస్తారు. నిజానికి వీరిమధ్య నడిచే విషయాల్ని కేసీఆర్ దగ్గర ప్రస్తావించే దమ్ము.. ధైర్యం ఉన్న నేతలు కూడా లేరన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఇదిలా ఉంటే.. గత రెండు నెలలుగా చోటుచేసుకున్న పరిణామాలు మంత్రి హరీశ్ వర్గాన్ని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కొన్ని కీలక కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ హాజరు కావటం.. ఆయనకు విశేష ప్రాధాన్యత లభించటంపై హరీశ్ వర్గం రగిలిపోతోంది. మొన్నటికి మొన్న టీ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవటం తెలిసిందే. అయితే కేసీఆర్ గైర్హాజరు లోటును మంత్రి కేటీఆర్ భర్తీ చేయటం గమనార్హం. ఇదే తీరులో పలు కార్యక్రమాలకు సంబంధించి కేటీఆర్ కు పెద్దపీట వేస్తున్నారు. దీనిపై హరీశ్ వర్గం తీవ్ర అసంతృప్తికి గురి అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఊహించని మరో పరిణామం ఒకటి తాజాగా చోటు చేసుకుందని చెబుతున్నారు. వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా దాని బాధ్యతను ఏడుగురు మంత్రులకు అప్పగించటం తెలిసిందే. ఉప ఎన్నికల జరిగే వరంగల్ పార్లమెంటు స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కో మంత్రికి బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడుగురిలో మంత్రి హరీశ్ ఉన్నారు. సహజసిద్ధంగా తనకున్న నాయకత్వ లక్షణాలతో ఆయన.. తనకు కేటాయించిన నియోజకవర్గంతో పాటు.. మిగిలిన నియోజకవరగం విషయాల్ని పరిశీలించటంతో పాటు.. వాటికి సంబంధించిన అంశాలపై దృష్టి పెడుతున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి హరీశ్ కు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాలని.. మిగిలిన అంశాల్లో జోక్యం చేసుకోవద్దంటూ విస్పష్ట ఆదేశాలు వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి హరీశ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యవహారం కచ్ఛితంగా హరీశ్ దూకుడుకు కళ్లెం వేయటంతో పాటు.. వరంగల్ ఉప ఎన్నిక తుది ఫలితం హరీశ్ శ్రమతో వచ్చిందన్న పేరు ప్రఖ్యాతుల్ని దూరం చేసేందుకేనని చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే హరీశ్ జోరుకు కేసీఆర్ కళ్లాలు వేశారని.. సరిహద్దులు పెట్టుకోకుండా దూసుకెళ్తున్న హరీశ్ కు చెక్ చెప్పినట్లుగా అంచనా వేస్తున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో విజయంపై పూర్తి భరోసా ఉన్న టీఆర్ ఎస్.. ఆ క్రెడిట్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హరీశ్ ఖాతాలో పడేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. అందుకే.. ఇలా కత్తెరేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.