Begin typing your search above and press return to search.
కేసీఆర్ చరిత్రను మరిచారా? ఉద్యోగుల పై వేటేసిన సీఎంలకు తిప్పలే..
By: Tupaki Desk | 7 Oct 2019 6:08 AM GMTఉద్యమనేతకు ఉద్యమాలతో చోటు చేసుకునే ప్రభావం గురించి గుర్తు చేయాల్సి రావటానికి మించిన విచిత్రమైన పరిస్థితి మరొకటి ఉండదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం వివిధ దశల్లో నడిపిన ఉద్యమాలు.. ఆందోళనలు.. పోరాటాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. తనకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులంతా ఏకమయ్యేందుకు అవకాశం ఇస్తున్నారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగులపై ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఆ శాఖకు సంబంధించిన వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా ఆర్టీసీ విలీనాన్ని కోరుకోవటంతో పాటు.. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ.. పండుగ వేళలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరగటం ఒక ఎత్తు అయితే.. సమ్మెలో పాల్గొంటున్న 48 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల్ని తొలగించినట్లేనని స్పష్టం చేయటం సంచలనంగా మారింది.
ఉద్యమాల్ని అరచేతితోనో.. అధికారంతోనో ఆపొచ్చన్నది ఎంత పిచ్చి పని.. అమాయకత్వం అన్న విషయం తెలంగాణ రాష్ట్ర సాధనతో తేలిపోయిన వేళ.. దాన్ని సాధించిన నేతే.. ఇప్పుడు సమ్మె చేస్తున్న వారిపైన షాకింగ్ నిర్ణయాన్ని తీసుకోవటం హాట్ టాపిక్ గా మారింది.
సమ్మె చేస్తున్న వారు ప్రస్తావిస్తున్న అంశాల్లో హేతుబద్ధత ఎంతన్నది ముఖ్యం. ఆ విషయాన్ని వదిలేసి.. వెనుకా ముందు చూసుకోకుండా.. తెగే వరకూ లాగేలా నిర్ణయాలు తీసుకోవటం ఏ మాత్రం మంచిది కాదు. గడువు విధించి.. ఆ లోపు సమ్మె విరమించకపోతే.. ఉద్యోగాలు పోయినట్లేనంటూ ప్రకటించటం ద్వారా.. ఉద్యోగుల్లో మరింత ఆగ్రహానికి గురయ్యేలా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి.
ఎడాపెడా నిర్ణయాలు తీసుకోవటం బాగానే ఉన్నా.. ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాల గురించి కేసీఆర్ పెద్దగా ఆలోచించలేదా? అన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. సమ్మె చేస్తున్న ఉద్యోగుల్ని గంపగుత్తగా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి వ్యక్తేం కాదు. గతంలోనూ ఇదే తరహాలో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో పాటు.. పలువురు తీసుకొని.. ఆ తర్వాత న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బ తగిలిన వైనాన్ని కేసీఆర్ మర్చిపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మీద వివిధ కారణాలతో కోపంతో కొన్ని వర్గాలు ఉన్న వేళ.. ఆ కోపాన్ని మరింత పెంచేలా నిర్ణయాలు తీసుకోవటం గులాబీ బాస్ కు మంచిది కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.