Begin typing your search above and press return to search.

బాబు మాట‌లు చెప్తే...కేసీఆర్ చేత‌ల్లో చూపాడు

By:  Tupaki Desk   |   23 Dec 2016 6:35 AM GMT
బాబు మాట‌లు చెప్తే...కేసీఆర్ చేత‌ల్లో చూపాడు
X
తెలంగాణ రాష్ట్రానికి రూ.20,704 కోట్లు - ఆంధ్రప్రదేశ్‌ కు రూ.16,240 కోట్లు. ఏంటి డ‌బ్బుల లెక్క‌లు అంటున్నారా? న‌వంబ‌ర్ 8న పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర‌ప్రదేశ్‌ కు వ‌చ్చిన కొత్త నోట్ల అధికారిక లెక్క! ఈ సంఖ్య‌ల‌ను స‌రిగ్గా గ‌మ‌నిస్తే... జనాభాలో- విస్తీర్ణంలో పెద్దదైన ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రానికే ఇప్పటి వరకు ఎక్కువ నోట్లు రావడం విశేషం. అంటే ప్ర‌తిరోజూ మీడియాలో వ‌స్తున్నట్లుగా అధికారుల‌తో స‌మీక్ష‌లు పెట్ట‌డం, ఆర్బీఐకి ఉత్త‌రాలు రాయ‌డం - ఇన్ని నోట్లు వ‌చ్చాయి.., అన్ని నోట్లు వ‌చ్చాయ‌నే ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న బాబు కంటే సైలెంట్ గా ప‌నిచేసుకుంటూ పోయిన కేసీఆరే ఎక్కువ మొత్తం త‌న రాష్ట్రానికి రాబ‌ట్టుకున్నార‌న్న‌మాట‌!

తాజాగా లెక్క‌ల ప్ర‌కారం పెద్ద నోట్లు రద్దు తర్వాత (నవంబర్ 8) ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ.20,704 కోట్లు అందగా, ఆంధ్రప్రదేశ్‌ కు రూ.16,240 కోట్లు అందినట్టు అధికారిక స‌మాచారం. తమ రాష్ట్రంలో నోట్ల కష్టాలను తీర్చడానికి ఎక్కువ మొత్తంలో కరెన్సీని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అధికారులను ఆర్‌బిఐకి పంపించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం బయటికి ఏమాత్రం హడావుడి చేయకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఎప్పటికప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ - ఆర్‌ బిఐకి వేర్వేరుగా లేఖలు రాయిస్తూ ఒత్తిడి పెంచారు. ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణకే ఎక్కువ కరెన్సీ విడుదల కావడానికి ఇదే కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా నోట్ల కష్టాలు ఈ నెలాఖరుతో తీరిపోనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు రెండు రోజులుగా పెద్ద మొత్తంలో తెలుగు రాష్ట్రాలకు ఆర్‌ బిఐ నోట్లను పంపించింది. దీంతో హైదరాబాద్‌ లో నెలన్నరగా మూతపడిన ఏటీఎంలు తెరుచుకున్నాయి. బ్యాంకులలో చాలీచాలనంతగా కాకుండా ఒకేసారి రూ. 20 వేల వరకు చెల్లింపులు జరిగాయి. ఒక్కో అకౌంట్‌ పై నాలుగు - ఐదు వేలకంటే మించి ఇవ్వని బ్యాంకులు ఇరవై వేల వరకు ఇవ్వడంతో బ్యాంకుల వద్ద జనం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టారు. ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రానికి బుధవారం రూ. 1600 కోట్లు - గురువారం ఆంధ్రప్రదేశ్‌ కు రూ. 1500 కోట్లు విడుదల అయినట్టు ఆర్థికశాఖ వర్గాల సమాచారం. సరిపడినన్ని కాకుండా చాలీచాలనన్ని నోట్లను తెలుగు రాష్ట్రాలకు పంపించడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు ఆందోళనను వ్యక్తం చేస్తూ కేంద్రానికి - ఆర్‌ బిఐకి తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తాజాగా లేఖలు రాయడంతో ఈ నెలాఖరు వరకు సరిపడేంత నగదును ఆర్‌ బిఐ విడుదల చేసినట్టు అధికార వర్గాల సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/