Begin typing your search above and press return to search.

జమిలికి కెసీఆర్ జేజేలు

By:  Tupaki Desk   |   5 Aug 2018 7:13 AM GMT
జమిలికి కెసీఆర్ జేజేలు
X
దేశంలో అన్ని శాసనసభలకు... లోక్‌ సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహంచేందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఓకె చెప్పినట్లు సమాచారం. తగ కొన్నాళ్లుగా భారతీయ జనతా పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్న కె.చంద్రశేఖర రావు శనివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ గంట సేపు జరిగిన ఈ భేటీలో తెలంగాణలో జోనల్ వ్యవస్ధతో పాటు పలు అంశాలు చర్చలోకి వచ్చినట్లు సమాచారం. అలాగే దేశవ్యప్తంగా ఒకేసారి శాసనసభకు - లోక్‌ సభకు ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. ముందుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ అంశాన్ని లేవనెత్తినట్లు ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఆర్ధికంగానూ - సమయ పాలన పరంగానూ కూడా కలిసి వస్తుందని ఇద్దరు నాయకులు అభిప్రాయపడినట్లు తెలిసింది. జమిలి ఎన్నికల కారణంగా అధికారంలో ఉన్న వారికి మేలు జరుగుతుందని - ఎన్నికలను అధికార పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందన్న కొన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఈ ఇద్దరు నాయకులు అభిప్రాయపడినట్లు సమాచారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించడంపై ఇద్దరు నాయకులు చాలా సేపు చర్చించుకున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడి వైఖరి తప్పని - జమిలిగా ఎన్నికలకు వెళ్లడం వల్ల దేశానికి ఆర్ధికంగా ఎంతో మేలు జరుగుతుందని వారిద్దరు అభిప్రాయపడినట్లు సమాచారం. అనవసరపు వ్యయానికి చెక్ పెట్టాలంటే జమిలి ఎన్నికలే మంచి పరిష్కారమని వారిరువురు అభిప్రాయపడ్డారని తెలిసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ - తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుల భేటీలో ముందస్తు ఎన్నికలపై కూడా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని కూడా ముందుగా ప్రధానమంత్రే ప్రస్తావించారని చెబుతున్నారు. " ముందస్తుపై మీ అభిప్రాయం ఏమిటీ " అని ప్రధాని నరేంద్ర మోదీ ముక్కుసూటిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును అడిగినట్లు చెబుతున్నారుదీనికి సమాధానంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు " మీరు వెళ్లే... మేమూ మీ వెంటే వెళ్తాం " అని చెప్పినట్లు చెబుతున్నారు. డిసెంబర్ లో కాని జనవరిలో కాని నాలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగునున్నాయని, వాటితో పాటు ఇతర రాష్ట్రాలకు - లోక్‌ సభకు కూడా ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుందని ఇద్దరు నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. వీరిద్దరు జమిలి ఎన్నికలు... ముందస్తు ఎన్నికలకు ఏకం కావడంతో బహుశా ఆ దిశగా అడుగులు పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.